సుప్రభాత కవిత ; -బృంద
నిండు ఆమవస నాడు
వచ్చే పున్నమి రేయి
తిమిరంతో సమరం చేసి
గెలిచే దీపాలు వేయి.

గోరంత దీపం ఇచ్చేది
కొండంత వెలుగైతే 
వేయి దీపాలు ఒక్కటై
నింపేది  వెలుగుల కేళి

అధర్మంపై ధర్మం గెలుపులు
చీకటిలో దీపాల  మెరుపులు
జ్యోతితో వెలిగించు జ్యోతులు
చెలిమి పంచే  నెయ్యపు రీతులు

మనసు దివ్వెలో ప్రేమను
వెలిగించి పంచాలి అందరం
మానవత్వపు వెలుగులు
కొనసాగాలి  నిరంతరం

అహం నిండితే ఇహంలో
అందరూ దూరమే!
అభిమానం పంచితే 
అందరూ  అయినవాళ్ళే!

స్నేహం పెరగాలి
సహకారం అలవడాలి
సర్దుబాటు ఉండాలి
సహనంతో మెలగాలి

జగతికి వెలుగులు పంచే 
జ్యోతి కలశపు పసిడికాంతులు
ప్రతి ముంగిలిలో ప్రసరించి
ప్రతి హృదయంలో ఆనందం నింపాలి

ఆకాశంలో చుక్కల్లాగా
అవని మొత్తం దీపాలు వెలిగి
అంధకారమంత తొలగి
అహరహం వెలుగులు పంచు వేకువకు

శుభాకాంక్షలతో

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు