శ్రీ రాముడు ; కొప్పరపు తాయారు

 బిభేద చ పునః సాలాన్ సప్త ఏకేన మహా ఇషుణా |


గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తథా |


తతః ప్రీత మనాః తేన విశ్వస్తః స మహాకపిః |


కిష్కింధాం రామ సహితో జగామ చ గుహాం తదా !


తతః అగర్జత్ హరివరః సుగ్రీవో హేమ పింగలః |


తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః |

అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః |

నిజఘాన చ తత్ర ఏనం శరేణ ఏకేన రాఘవః 

తతః సుగ్రీవ వచనాత్ హత్వా వాలినం ఆహవే |

సుగ్రీవం ఏవ తత్ రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్ |


సుగ్రీవునకు పూర్తిగా విశ్వాసము కలిగించుటకై రాముడు ప్రయోగించిన బాణము రివ్వున సాగి, వరుసగానున్న ఏడు మద్దిచెట్లను, ఆ సమీపమునే ఉన్న ఒకపర్వతమును, రసాతలమును భేదించి, అదేవేగముతో వచ్చి ఆయన తూణీరమున జేరెను.-వాలిని హతమార్చుటకు శ్రీరామునకుగల పరాక్రమ విషయమున సుగ్రీవుని మనస్సులో సందేహము మెదలుచుండెను. 

అప్పుడాసుగ్రీవుడు లోకోత్తరమైన శ్రీరాముని పరాక్రమును జూచి, ఎంతయు సంతోషించెను. సుగ్రీవునకు అతని పరాక్రముపై పూర్తిగా నమ్మకము కుదురుకొనెను. పిమ్మట అతడు రామునితో గూడి కొండలమధ్య గుహవలెనున్న కిష్కింధను సమీపించెను. బంగారు పింగళవర్ణములు గలవాడు, కపిశ్రేష్ఠుడు ఐన సుగ్రీవుడు బిగ్గరగా గర్జించెను. ఆ మహానాదమును విని, వానర ప్రభువైన వాలి తనగృహమునుండి బయటికి వచ్చెను. "సుగ్రీవునితో యుద్దము చేయుటకు వెళ్ళవలదు" అని వారించుచున్న తారను సమాధానపఱచి, వాలి సుగ్రీవునితో తలపడెను. అప్పుడు రాఘవుడు వాలిని ఒకే ఒక్క బాణముతో వధించెను. సుగ్రీవుని ప్రార్థనను అనుసరించి వాలిని వధించిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవుని కిష్కింధకు రాజునుగా జేసెను. 

              ఓం శ్రీ రామ

              ***


కామెంట్‌లు