భారతదేశపు ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 135వ జయంతి సందర్భంగా నిర్వహించిన
బాలలదినోత్సవం కార్యక్రమం శ్రీకాకుళంజిల్లా, కంచిలి మండలం,చొట్రాయిపురం ఎంపీపీ స్కూల్ లో ప్రధానోపాద్యాయులు మడ్డు తిరుపతి రావు మాస్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మా విద్యార్దులు యగు కర్రి హారిక(5వ), కర్రి ఈశ్వరరావు(5వ)లచే నిర్వహించిన గణిత అంగుష్టావధానం కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా అందరినీ అబ్బుర పర్చింది.
గణిత అంగుష్టావధానం ప్రక్రియ జరిగే విధానం పరిశీలిస్తే అవధానం చేసే విద్యార్దులు ఇద్దరు విద్యార్దులు ఎదురెదురుగా కూర్చుంటారు.ఒక విద్యార్థి ఖాళీ చేతులతో,మరొక విద్యార్థి పలక సుద్ధముక్క తో ఉంటారు.సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్న వ్యక్తి వారికి సమాన దూరంలో ఉంటూ,ముగ్గురు త్రిభుజ ఆకారంలో కూర్చుంటారు.ఇప్పుడు సమన్వయ కర్త ఒక పలక పైన చతుర్విధ ప్రక్రియలలో ఒక సమస్యను రాసి,ఖాళీ చేతులతో కూర్చున్న మొదటి విద్యార్థికి చూపించడం జరగుతుంది. ఆ సమస్యను ఆ విద్యార్థి అర్ధం చేసికొని,తన బొటన వేళ్ళు సహాయంతో సైగలు ద్వారా రెండో విద్యార్థికి చెప్పడం జరగుతుంది. ఆ బొటనవ్రేలు సైగలను అర్ధం చేసికొని, ఆ సమస్యను రెండో విద్యార్థి పలక పైన రాసి,దానిని సాధన చేసి చూపిస్తాడు. అప్పుడు మొదటి సమన్వయ కర్త రాసిన సమస్యను,రెండో విద్యార్థి పలకపైన రాసిన సమస్యకు సరిపోతుంది. ఈ విధంగా గణిత అంగుష్టావధానం లో ఇద్దరు విద్యార్దులు 0 నుండి 9 వరకు అంకెలను,చతుర్విధ ప్రక్రియలలో కూడిక, తీసివేత,గుణకారం,భాగాహారం,మరియు ఎన్ని వరుసల సమస్య,లెక్క ప్రారంభం, ముగింపు మొదలగు ప్రక్రియలు రెండు బొటన వ్రేలు సహాయంతో సైగలు ద్వారా మాత్రమే చెప్పడం ఒక అద్భుత ప్రక్రియగా భావించవచ్చును. ఈ సందర్భంగా సహాపా ద్యాయులు శ్రీ చల్ల లింగమూర్తి మాస్టర్ బాలల దినోత్సవం గురించి వివరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీ డొక్కరి బ్రహ్మనందం,PMC చైర్మన్ శ్రీ కర్రి సుందరరావు మాట్లాడుతూ, గణిత అంగుష్టావధానం ప్రక్రియలలో అద్భుతమైన ప్రదర్శన నిర్వహించిన విద్యార్దులు కర్రి హారిక, కర్రి ఈశ్వరరావు,అవధాని మడ్డు తిరుపతి రావు మాస్టర్ లను అభినందించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి