సుప్రభాత కవిత ; -బృంద
నిత్యం చూసే సత్యమైన
నూతన ఉదయం

చిమ్మ చీకట్లు వెలుతురు
రాకతో పరుగులే!

తూరుపంతా అలముకున్న
నారింజ  రంగులే!

అంబరమంతా అలవికాని
సంబరాలే!

స్వేఛ్చా విహంగాలు 
ఇష్టంగా పాడే నవగీతాలే!

సాగర గర్భాన రాత్రి
సేద దీరి ఉదయించే బింబమే!

అలల లాగా కదిలే
అలవని ఆశల ఆరాటాలే!

ఆదిత్యుని ఆగమనాల మోగే
సరిగమల ఆనందరాగాలే!

గుప్పెడు గుండెలో ఉప్పొంగే
ఊహల ఉప్పెనలే!

కెరటాల పై కోరికల 
ఉయ్యాలల సయ్యాటలే!

సురమణీయ కమనీయ
సుందర దృశ్యమే!

నీరద పంక్తులు పాడే
మోహన రాగమాలికలే!

నవ్యజీవన బృందావన
వసంత ఆగమనపు సూచికలే!

తమోమయమైన
జీవితాల ఆశతో వెలిగించు 

ఉదయానికి మదిపాడే
మోహనమైన

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు