నేను ఆలసిపోయి వస్తే
మృదువుగా తల నిమిరావు
నేను జ్వరంతో పడుకుంటే
ప్రేమగా సేవించావు
నేను నిద్రలో ఉలిక్కిపడితే
గుండెలకు హత్తుకున్నావు
నేను బాధతో కుమిలితే
ఆత్మీయతతో ఓదార్చావు
నాతో ఏడడుగులు నడిచావు
నాకు అమృతఘడియలు అందించావు
అందుకే ప్రియా!
నీలోనే నేను
సదా
ఒదిగిపోతా! ఒరిగిపోతా!
కలిసిపోతా! కరిగిపోతా!!
*********************************
కలిసిపోతా;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి