బద్ధకం ( బాల పంచపదులు )- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 బద్దకం జనులకు పెద్దరోగము
సదా నిద్దుర పోవుట దరిద్రము
పెద్దల మాట వినక పోవటము
మొద్దుతనము పరమ మూఢత్వము
గద్దరి పనులు చేయకు విజయా!/

వద్దు వద్దురా మనకలసత్వము
ప్రొద్దు ప్రొద్దున్నే నిదుర లేవటము
బుద్ధిగా చదువు నేర్చుకోవటము
శుద్ధమైన దారిలోన వెళ్ళటము
పధ్ధతిగా బ్రతుకవమ్మ!విజయా!/

చురుకుగా పనులను చేయటము
పరుల మేలుకై పాటుపడటము
కఱకుతనంబు వీడి మెల్గటము
స్థిరమైన మనస్సుతో సద్గుణము
కొఱకై శోధించి చరించు విజయా!//


కామెంట్‌లు