చీకటి రెప్పలు తీసి
రేపటి ఉదయం కోసం
ఎరుపెక్కిన తూరుపు
వేచిన మదికి ఓదార్పు
పట్టలేని ఆనందాల
వెల కట్టలేని క్షణాలు
బట్టబయలు చేస్తూ
కట్టు తప్పినట్టూ....
చెప్పలేని మమతల
కప్పలేని మనసున
తెప్పలై అనుభూతులు
ముప్పిరుగొను వేళ
కంటిలోని మెరుపులన్నీ
పెదవులపై చేరుకుని
వదలక చిరునవ్వై
అంటిపెట్టుకునే ఉంటే
మౌనమైన రాగమేదో
మూగవీణ పలికించి
రాగసుధలెన్నిటినో
ధారగా కురిపించేవేళ
కమ్ముకున్న వెలుగులన్నీ
కమ్మనైన కలలకు రూపమిచ్చి
కనులముందు నిలిపి
కలిమి నొసగినట్టు
ఆనందపు అర్ణవంలో
అరుదైన వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి