సమాజ అధ్యయనమే సాంఘికశాస్త్రం

 తరతరాల సామాజిక అంశాల సమాహారమే సాంఘిక శాస్త్రమని తలవరం పాఠశాల సముదాయం ఛైర్మన్ ఉప్పాడ అప్పారావు అన్నారు. తలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీరఘట్టం, పాలకొండ మండలాలకు చెందిన సాంఘిక శాస్త్రోపాధ్యాయులు హాజరైన సాంఘిక శాస్త్ర విషయ సముదాయ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం యొక్క అధ్యయనమే సాంఘిక శాస్త్రమని అన్నారు. 
సాంఘిక శాస్త్ర శిక్షణాంశాల జిల్లా రిసోర్స్ పర్సన్ లుగా బౌరోతు మల్లేశ్వరరావు, వూలక రవి, మాచర్ల రఘునాథదొర, పోతురాజు శంకరరావులు వ్యవహరించారు.
సాంఘిక శాస్త్రాన పటనైపుణ్యం, 
మూల్యాంకనం, పాఠ్యాంశవిశ్లేషణ, అవగాహన, పునశ్చరణలతో ఎన్.సి.ఎఫ్. ఫ్రేమ్ గూర్చి తొలుత వివరించారు. 
అభ్యసనాభివృద్ధి కార్యక్రమం 'లిప్' కార్యక్రమంలో మైండ్ మేప్, పూర్వజ్ఞానంతో అవగాహన పెంపొందించుట గూర్చి వివరించారు. 
కనీస అభ్యసన స్థాయి సాధించేలా అమలుచేస్తున్న జాతీయ విద్యా విధానం ఆవశ్యకతను తెలిపారు.
విద్యార్ధిదశ నుండే నాయకత్వ లక్షణాలను, పోటీతత్వాన్ని, జాతీయ సమైక్యతా భావాలను అలవర్చేలా క్రీడా రంగం స్ఫూర్తినిస్తుంది కాబట్టి, పాఠశాలలకు ఇచ్చే క్రీడాసామగ్రిని సద్వినియోగపర్చాలని అన్నారు.
స్కూల్ కాంప్లెక్స్ ఛైర్మన్ ఉప్పాడ అప్పారావు పాఠ్యపథకరచనలో గల సోపానాలను, కీలకమైన అంశాలను చర్చించారు.
కుదమ తిరుమలరావు, గొడబ విజయభాస్కర్, పర్రి రామమూర్తి, కె.జయమణి, బి.ప్రసన్నకుమారి, పెయ్యల హేమలత, కె.జనార్ధనరావు తదితరులు పలు చర్చల్లో పాల్గొన్నారు.
కామెంట్‌లు