సుప్రభాత కవిత ; -బృంద
పసిడి సైకత వేదికలమీద
మిడిసి పడుతున్న అలలు
ఒడిసి పట్టని తీరాలు
విడిచి పెట్టని పంతాలు

నిత్య జీవన పోరాటం
అలసిపోనిది  ఆరాటం
పరుగు ఆపని కెరటం
కడలి కందని తీరం

కల్లలు అయినా కలలు
అల్లరి ఆపని ఊహలు
చల్లగ ఊపే ఊయలలు
మెల్లగ సాగే పరుగులు

కాలికింద జారు ఇసుకలా
తొలగి పోవు క్షణాల  తీరు
వెలుగు కిరణాల తాకిడికి
జిలుగులంటిన  నీరు

మిన్నుల సాగే కాంతిరథం
కన్నుల పండుగ చేయగా
వన్నెలు నిండిన భువనపు
చిన్నెలు చూడగ మురిపెం

తరగని జీవన సౌందర్యం
సాగే తరంగాల సోయగం
నవ్వుల మువ్వల సవ్వడులు
సాగే  తరగల  నురగలు

మనసు తెరమీద వెలిగే 
మరో పుత్తడి వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు