చంటిపాప నవ్వులాగా
పాకుతున్న వెలుగులు
కంటిపాపను మేలుకొమ్మనే
కబురు తెచ్చే కిరణాలు
నవ్వు చూసి మురిసిన
అమ్మ మనసులా
మనసంతా నువ్వేనంటూ
పచ్చగ నవ్వే ప్రకృతి
నిలిచిన నీటి అద్దాన
తొంగి చూసి తనకోసం
వేచిన ఏటిని వెచ్చగ
చుంబించే సూర్యుడు
వీరిరువురి సరాగాలు చూసి
విరిసిన పూవుల పెదవుల
మురిపెంగ నవ్వుతూ తోట
ముచ్చటగ చూసెనంట
గగనపథాన పరుగులిడగ
ఎత్తుకు ఎదుగుతున్న
రవిబింబము చూసి
గర్వముతో పొంగెనంట పర్వతాలు
పచ్చని పచ్చిక తివాచీ
పాదముల కిందుగ పరచి
నులివెచ్చని స్పర్శను
పొందగ వేచెనంట నేలతల్లి
చూసినంతనే మనసు దోచు
కమనీయ దృశ్యము
కనులనిండ కాంచుట
కలిమి కాదే ఇలను???
ఆశల పందిరి వేస్తూ
ఆగమించే వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి