ఒత్తిళ్ళ దుష్ప్రభావం- సి.హెచ్.ప్రతాప్
 మానవ జీవితంలో వేగం ఎప్పుడయితే ప్రవేశించిందో అప్పుడే రకరకాల మానసి ఒత్తిడులు మనిషిని కృంగదీయడం మొదలైంది. ఇంటా బయట ఎన్నో సమస్యలు, ఉద్యోగులు వ్యాపారులు, విద్యార్థులు, గృహిణులు ఇలా అన్ని వర్గాలవారు పరుగెత్తు కాలంతో సమంగా పరుగెత్త లేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు... మానసిక ప్రశాంతత లోపిస్తే ఏ పని పట్ల శ్రద్ధ వహించడం సాధ్యపడదుఅన్న సంగతిని విస్మరించకూడదు. మనకు నిత్యజీవితంలో ఒత్తిడిని కలిగించే విషయాలు కుటుంబ విషయాలు, వృత్తి పరమైన విషయాలు, వైవాహిక సంబంధాల వల్ల కలిగే ఒత్తిడికలిగే ఒత్తిళ్ల ఇలా మన జీవితాలు అనుక్షణం ఒత్తిళ్ళతో సావాసం చేయాల్సి వస్తోంది.
ఉద్యోగాల విషయమైన ఒత్తిళ్ళు భద్రతకు ముప్పు వాటిల్లడం వల్ల కలిగే ఒత్తిళ్లు జీవితంలో అనుకున్నది సాధించలేక పోవడం వాళ్లకి వల్ల కలిగిన ఒత్తిళ్లు .సరైన స్టిమ్యులేషన్ జీవితంలో ఏర్పడక కలిగే మానసిక ఒత్తిళ్ళుసంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి ,నిత్యం ఎదురయ్యే అవకాశాలను అందిపుచ్చుకోవడానికి,  నిత్యజీవితంలో తన కర్తవ్యాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి , అవసరమైన చోట సమర్థవంతమైన నాయకత్వం అందించడానికి , పాలన రంగంలో పనిచేస్తున్న వాళ్లు మరింత ఉత్సాహంగా      పనిచేయడానికి  మెదడు యొక్క పనితీరును  మరింత మెరుగుపరచుకోవటం అనివార్యం  .అందుకు విశ్రాంతి అనేది తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. స మాజం విచ్ఛిన్నంతోపాటు సంక్లిష్టమైన కొద్ది  పెరుగుతున్నటువంటి మానసిక ఒత్తిళ్ళ కారణంగా కూడా మెదడు  దుష్ప్రభావానికి లోను కావడాన్ని మనం గమనించాలి.  దాని ఫలితంగా నిద్రలేమి సమస్యలు  ఎదుర్కొంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తుంటే  విశ్రాంతి ఆవశ్యకత  ,నిర్లక్ష్యం చేస్తే కలిగే దుష్ప్రభావాలపైన  నిపుణుల సూచనలను  తెలుసుకోవడం మనందరి బాధ్యత. అయితే లక్ష్యాలను చేరుకునే ప్రక్రియలో భాగంగా మానవుడు నిత్యం పరుగులు తీస్తూ తన మానసిక ఆరోగ్యాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నాడన్నది నిర్వివాదాంశం.
మానసిక వత్తిడి వల్ల కుటుంబ వ్యవహారాలు కూడా దెబ్బతింటాయి. అనుబంధాలు మృగ్యం అవుతాయి. మానసిక ఒంటరితనం ఏర్పడడం వల్ల ఏ పనులు సక్రమంగా నెరవేరవు దాని వల్ల చెడు అలవాట్లకు లోను కావాల్సి వస్తుంది. మానసిక వొత్తిడికి గురైనవారు చెడు అలవాట్లకు బానిసలు అవుతార్రు. వీటి వల్ల మానసిక ఆవేదనలు తగ్గుతాయి. అవయినా తాత్కాలికంగా తగ్గుతాయి. మానసికంగా తాత్కాలికమైన వుపశమనం లభిస్తుంది. కాని దాని యొక్క దుష్ఫలితాలు ఆలస్యంగా ప్రస్ఫుటమవుతాయి.
ప్రకృతితో , ప్రజలతో, సమాజంతో మమేకం కావడం,   కనీసం నిద్ర 7 నుండి 8 గంటలు  అవసరమని అదే సందర్భంలో  అనివార్యంగా  నిర్ణీత గంటలు నిద్రపోని వాళ్ళు  మిగతా సమయాలలోనైనా కొంతవరకు  నిద్రపోతే  మెదడు పనితీరు  చురుకుగా మారుతుంది. ఆటలు, శారీరక వ్యాయామం,  నడక , చర్చలు , ఇతర విన్యాసాలు కూడా మెదడుకు విశ్రాంతి కలిగించడానికి  చాలా తోడ్పడతాయి  .
సోషల్ మీడియా, టీవీ  ,సెల్ ఫోను, కంప్యూటర్లకు  రోజులో కొద్దిసేపు అయినా  విరామం ఇవ్వడం ద్వారా కూడా  మెదడు పూర్తిస్థాయిలో విశ్రాంతి పొందే అవకాశం ఉన్నది .

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం