రక్షసాం నిహతాని అసన్ సహస్రాణి చతుర్ దశ |
తతో జ్ఞాతి వధం శ్రుత్వా రావణః క్రోధ మూర్ఛితః |
సహాయం వరయామాస మారీచం నామ రాక్షసం |
వార్యమాణః సుబహుశో మారీచేన స రావణః |
న విరోధో బలవతా క్షమో రావణ తేన తే |
అనాదృత్య తు తత్ వాక్యం రావణః కాల చోదితః |
రావణుడు తన దాయాదులైన ఖర దూషణ త్రిసురులను, శ్రీరాముడు వధించెను అను వార్త శూర్పణఖ ద్వారా విని క్రోధము తో ఉడికిపోయెను.. పిమ్మట ,అతడు మారీచుడు అను రాక్షసుని కడకు (సీతాపహరణ) విషయమై అతని సహాయము అర్థించెను.
అప్పుడా మారీచుడు శ్రీరాముడు నీకంటెను శక్తిమంతుడు అంతటివానితో విరోధము నీకు తగదు. అని పలికి, పెక్కు విధముల వారించెను.
వాని హెచ్చరికలను పెడచెవిన బెట్టి, ఆయువు
మూడిన రావణుడు మారీచుని వెంటబెట్టుకొని శ్రీరాముని ఆశ్రమం ( పంచవటి) సమీపమునకు చేరెను.
శ్రీ రాముడు ;కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి