దేశ భక్తి; - సి.హెచ్.ప్రతాప్

 తనను కని, పెంచిన అమ్మనాన్నలపై ఎటువంటి ప్రేమ ఉంటుందో, అలాగే తన పూర్వీకుల నుండి తనకు ఆశ్రయం అందించిన ప్రాంతం అంటే తన దేశంపై తనకు గల ప్రేమను దేశభక్తి అంటారు. ఒక వ్యక్తికి అమ్మపై ఎలా ప్రేమ పొంగుతుందో, అలాగే దేశభక్తుడికి తన దేశంపై తనకు ప్రేమ కూడా అలాగే ఉంటుంది. ఇటువంటి దేశభక్తి ప్రతీ పౌరుడి నర నరాల్లో జీర్ణించుకుపోయి వుండాలని స్వామి వివేకానందుడు తరచుగా చెప్పేవారు. దేశభక్తి వలన యువతలో మంచి సామాజిక స్పృహ ఉండటమే కాకుండా, శత్రుసైన్యం దేశంపై బడినప్పుడు, శత్రుసైన్యంతో పోరాడడానికి యువతకు ముందుకు వస్తుంది. దేశంకోసం యుద్దం చేయడానికి సైతం వారు వెనుకాడరు. దేశం కోసం యుద్దం చేయడమే కాదు, దేశార్ధికాభివృద్దికి పాటుపడే తత్వం దేశభక్తి వలన యువతలో పెరుగుతుంది. సోమరితనం లేకుండా ఉండడానికి దేశభక్తి ఎంతగానో తోడ్పడుతుందని స్వామి వివేకానందులు అంటారు.నిజాయితీ, నిజం, తన దేశం కోసం చనిపోవాలనే కోరిక, తన భద్రత గురించి ఆలోచించకపోవడం, దేశం కోసం జీవించి చనిపోవాలనే ఆశయం, సొంత మాతృభూమి గురించి గర్వపడటం దేశభక్తికి మూలాధారాలు మరియు దేశభక్తుడు వాటి ద్వారా జీవించి మరణిస్తాడు.చదువుతో పాటు దేశభక్తి, సమాజాభివృద్ధి, సేవాతత్పరతను విద్యార్థులు పెంపొందించుకోవాలి. ప్రభుత్వాల తప్పుడు విధానాలను తిప్పికొట్టేందుకు బలమైన విద్యార్థి ఉద్యమాల అవసరం ఉంది. ప్రభుత్వాల వింత పోకడల వల్ల ఆర్థికవ్యవస్థ దెబ్బతినడమేకాక ఉపాధి సైతం కోల్పోయే పరిస్థితులు నేడు ఏర్పడ్డాయి. అటువంటి సందర్భాలలో ప్రభుత్వాలను గాడిలో పెట్టడానికి బలమైన విద్యార్థి ఉద్యమాలు నిర్మించాలి. విద్యావిధానంలో మార్పుల ఫలితంగా విద్యార్థి ఉద్యమాలు నీరుగారాయి. విద్యార్థుల్లో పూర్వపుచైతన్యం కొరవడింది. స్వాతంత్య్రానికి ముందు, తరువాత కూడా దేశంలో బలమైన విద్యార్థి ఉద్యమాలు నడిచాయి. రాజకీయ మార్పులకు, సమసమాజాభివృద్ధికి అవి ఎంతో ఉపయోగపడ్డాయి. 
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం