ఓ మేఘమాలా!;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కదులూ కదులూ కదులూ
మేఘామాలా కదులూ

కప్పూ కప్పూ కప్పూ
నింగినినిండుగ కప్పూ 

చల్లూ చల్లూ చల్లూ
వానా చుక్కలు చల్లూ 

జల్లూ జల్లూ జల్లూ
వానాజల్లూ జల్లూ

కురువూ కురువూ కురువూ
వానలు వసుధన కురువూ

తడుపూ తడుపూ తడుపూ
నేలలు పదునుగ తడుపూ

తొలగూ తొలగూ తొలగూ
క్షామం పూర్తిగ తొలగూ

పెరుగూ పెరుగూ పెరుగూ 
మొక్కలు పొలాల పెరుగూ 

తొడుగూ తొడుగూ తొడుగూ
ఆకులు పచ్చగ తొడుగూ

వచ్చూ వచ్చూ వచ్చూ 
చెట్లకు కొమ్మలు వచ్చూ 

పూయూ పూయూ పూయూ
మొగ్గలు దండిగ పూయూ

కాచూ కాచూ కాచూ
పిందెలు మెండుగ కాచూ

పండూ పండూ పండూ
పంటలు పుష్టిగ పండూ

చేర్చూ చేర్చూ చేర్చూ
ఇళ్ళకు పంటలు చేర్చూ

కూర్చూ కూర్చూ కూర్చూ 
పైసల పేరిమి కూర్చూ 

వెలుగూ వెలుగూ వెలుగూ
రైతుల మోములు వెలుగూ

చేతుం చేతుం చేతుం
మొయిలుకు పూజలు చేతుం

సర్వులకుకలుగు క్షేమం
సుఖినోభవంతు లోకం


కామెంట్‌లు