ప్రేమంటే- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ప్రేమ అంటే
ఒక అమీబా
స్నేహం, ద్వేషం, కోపం,
దుఃఖం, సంతోషం, విచారం
ఒక్కో సమయంలో
ఒక్కో రూపం
ప్రేమ అంటే
నీ కన్నీటిని నాకివ్వు
నా హృదయం నీకిస్తా
అనిపించేది
ప్రేమ అంటే
నీవున్నప్పుడు
నీ చూపులో
నీవు లేనప్పుడు
నీకై
ఎదురుచూపులో గడపడం
ప్రేమ అంటే
ఒక వసంతం
ప్రేమ అంటే
ఒక జలపాతం
ప్రేమ అంటే
చెలీ!
ఒక నువ్వూ, ఒక నేనూ!!
********************************

కామెంట్‌లు