1966 ఆ సమయం లో అనుకుంటాను లేతమనుసులు సినిమా వచ్చింది. ఆ సినిమా మా పెద్దన్నయ్య వదిన వాళ్లతో వెళ్లాను. బాగా నచ్చింది. సినిమా నుండి బయటికి వచ్చేటపుడు సినిమా పాటల పుస్తకాలు అమ్మేవారు. అన్నయ్యను భయపడుతూనే అడిగాను. అన్నయ్య
2 రూపాయలు పెట్టి కొనిచ్చాడు. అన్ని పాటలూ ఇష్టమే ! ఈ పాట మరీ ఇష్టం. నేర్ఛేసుకున్నాను. కొత్త పాట నేర్చుకుంటే ఎవరు పాడమన్నా ఆ పాటే పాడడం
ఆ సీన్ ని మా ఫ్రెండ్స్ తో కలిసి నాటకం లా వేసేవాళ్లం .నేను ఎప్పుడూ పప్పి నే… ఈ పాట పాడాలి కాబట్టి. సరస్వతి , సువర్ణ శశిరేఖ నేను…. మా ఆటలివే మరి!
సినిమాల ప్రభావం విషాయానికొస్తే… ఇప్పుడు మా అపార్టుమెంట్ లో పిల్లలు బొమ్మ గన్నులు పట్టుకొని ఆడతారు… “ఒరే! నిన్ను చంపేసాను . నువ్వు కదలొద్దు” అంటూ. డైలాగులు చెప్తూ ఆడుతూంటే…అయ్యో ఈ పిల్లలేం నేర్చుకుంటున్నారు. అనిపిస్తుంది
మరో మాట…. “ ఇదే సినిమాలో అందాల ఓ చిలకా! అనే పాట ఉంటుంది… ఆ పాటలో జమున గారు పొడవుగా రెండు జడలు వేసుకుంటుంది… మా అక్క వాళ్ల సవరాలు పెట్టి అలా రెండు జడలు వేయించుకునేదాన్ని అమ్మతో!!! ఏంటో ఆ.... పిచ్చితనం అనిపిస్తుందిప్పుడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి