పల్లెటూరి పిల్లలు
పలక బలపం పట్టారు
పరుగులు తీస్తూ వెళ్లారు
బడికి వారు చేరారు
ఏక దుస్తుల్లో ఉన్నారు
ప్రార్థన వారు చేశారు
కలిసి మెలిసి పిల్లలు
తరగతి గదిలోకెళ్లారు
గురువుకు వారు మొక్కారు
అ ఆ ఇ ఈ లు దిద్దారు
అక్షరాలన్నీ నేర్చారు
బాలశిక్ష చదివారు
ఆటలు ఎన్నో ఆడుతూ
పాటలు ఎన్నో పాడుతూ
పై తరగతిలోకి వెళ్లారు
ప్రథమ స్థానంలో నిలిచారు
ఇంటికి వచ్చి పిల్లలు
పనులు ఎన్నో చేస్తారు
బాధ్యతగా ఉంటారు
విద్యలో వెనక్కి వెళ్లారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి