చెల్లె కట్టిన మల్లెమాల (బాల గేయం);- ఎడ్ల లక్ష్మి
బల్లి పిల్ల వచ్చింది
బల్ల కింద చేరింది
చెల్లె వచ్చి చూసింది
తల్లి కేమో చెప్పింది

తల్లి మెళ్లేగ వచ్చింది
బల్ల వంచి పెట్టింది
బల్లి వెళ్లి పోయింది
చెల్లి చూసి నవ్వింది

బల్ల మీదికి ఎక్కింది
మల్లె మొగ్గలు తెంపింది
మెల్లగా మాల కట్టింది
మల్లికాంబకు ఇచ్చింది

మల్లికాంబ మాలతో
మెల్లిగా గుడికి వెళ్ళింది
తల్లి మెడలో వేసింది
చల్లని దీవెన లొందింది

కామెంట్‌లు