నర్మదీయ! అచ్యుతుని రాజ్యశ్రీ

 " టీచర్! ఈరోజు మేము స్లిప్ టెస్ట్ రాయం!" పిల్లలంతా పొలోమంటూ అరిచారు." ఏం? ఎందుకు?" " నిన్నంతా టి.వి.లో క్రికెట్ చూస్తూ కూచున్నాం." " మరి టిఫిన్ భోజనం చేయలేదా?"" తిన్నాం" " మరి చదువు కి ఎందుకు నామం పెట్టారు?"" ఆదివారం! ఆడుకున్నాం.""మీ అమ్మ వంట చేసింది.మీనాన్న మీటింగ్ అని ఆఫీస్ కి వెళ్లాడు.మీరు మాత్రం మీ బాధ్యత మరిచారు.నేను నర్మదీయ ని గురించి చెప్తాను వినండి."" నర్మదా నది పేరు విన్నాం! నర్మదీయ కొత్త ఉన్నదా?" టీచర్ అంది" అందుకే రోజూ పేపర్ చదవమని చెప్తాను.మధ్యప్రదేశ్ లోని కన్నాట్ పంచాయితీ కి చెందిన గోండు జాతి లో పుట్టిన దివ్యాంగురాలు.కాళ్ళు చేతులు లేని ఆపాపని చూసి అంతా బాధపడ్డారు.కానీ అమ్మ నాన్న ఎంతో ప్రేమగా సాకుతున్నారు.ఆమెనోటితో కుంచె పట్టుకుని గోండుల చిత్రకళను నేర్చి అద్భుతమైన చిత్రాలు గీస్తోంది. ఎన్నికలసంఘం ఈ.సీ.బ్రాండ్ ఎంబాసిడర్ గా గుర్తించింది.గిరిజన ఓటర్లను చైతన్య పర్చేలా చిత్రాలు గీసింది.నర్మదీయ రోల్ మోడల్ గా నిల్చింది.గోండ్సు జీన్స్ లోనే అద్భుతమైన చిత్రాలు గీసే శక్తి ఉంది.ఆమె గీసిన చిత్రాలు అమ్ముతూ వచ్చిన డబ్బుతో ఆత్మ విశ్వాసం తో ముందడుగు వేస్తోంది నర్మదీయ.అన్నీ ఉన్న మనం బద్ధకం సోంబేర్లకి మారుపేరు గా మిగిలాం " అంతే పిల్లలు నోరెత్తకుండా స్లిప్ టెస్ట్ రాయటానికి సిద్ధం అయ్యారు.రోజూ పాఠాలు శ్రద్ధగా వింటే చాలు.ముక్కున పట్టి రాయడంకాదు🌹
కామెంట్‌లు