మంచు దుప్పటి ముసుగులో
మగత వీడని కనులలో
జగము మునిగెను నిదురలో
వెలుగు నిండెను తూరుపులో!
అలసిన మనసుకు ఆలంబనగా
తెరిచిన కనులకు ధైర్యంగా
మూసిన వాకిట ముగ్గులుగా
వేకువ వచ్చెను పండుగలా!
అడవిని దాగిన చీకటికి
అవనిని కమ్మిన వెలుగులకు
అడ్డుగ నిలిచిన తెరవోలె
అలుముకున్నది పొగమంచే!
అంతరంగపు ఆకాంక్షలకు
అంతర్యామి ఆలోచనలకు
అంతరమెంతో తెలియనివ్వని
అరిషడ్వర్గాల మాయ అదియే!
అన్నీ తెలిసిన అజ్ఞానం
ఏమీ తెలియని విజ్ఞానం
విధి చేసే మాయాజాలం
గతి తెలియని అయోమయం
ఊగిసలాడిస్తున్న ఊహలతో
ఆగమిస్తున్న వేకువకు
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి