దుబ్బయ్య తాత (బాల గేయం)- ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
దుబ్బయ్య తాతా వచ్చాడు
రెండు దున్నలు తెచ్చాడు
వాటితోనాగలి కట్టాడు
పొలం అంతా దున్నాడు!

బారేడు పొద్దు ఎక్కింది
నాగలి విడిచి ఆ తాతా
కాలువ గట్టుకు చేరాడు
దున్నలపెయ్యి కడిగాడు!

దొడ్డిలో వాటిని తోలాడు
 గడ్డి తెచ్చి వేశాడు
చెట్టు కిందికి వచ్చాడు
అవ్వ అంబలి తెచ్చింది!

కంచం నిండా పోసింది
కడుపునిండా తాగాడు
నడుము వాల్చి ఒరిగాడు
నిద్ర లోకి జారాడు !

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం