ప్రహృష్టో ముదితో లోకః తుష్టః పుష్టః సుధార్మికః |
నిరామయో హి అరోగః చ దుర్భిక్ష భయ వర్జితః
న పుత్ర మరణం కేచిత్ ద్రక్ష్యంతి పురుషాః క్వచిత్ |
నార్యః చ అవిధవా నిత్యం భవిష్యంతి పతి వ్రతా
న చ అగ్నిజం భయం కించిత్ న అప్సు మజ్జంతి జంతవః |
న వాతజం భయం కించిత్ న అపి జ్వర కృతం తథా |
న చ అపి క్షుత్ భయం తత్ర న తస్కర భయం తథా |
నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్య యుతాని
శ్రీరాముడు రాజైనందులకు ప్రజలెల్లరును
సంతోషముతో పొంగిపోవుచు, ఆయన పాలనలో
సుఖః సౌభాగ్యములతో విలసిల్లుదురు.
ప్రభుభక్తితత్పరులై ధర్మమార్గమున ప్రవర్తించుదురు,
ఆరోగ్యభాగ్యములతో హాయిగానుందురు, కఱువు
కాటకములు లేకుండా నిర్భయముగా
పుత్రమరణములు లేకుండును రామరాజ్యమున,
స్త్రీలు పాతివ్రత్యధర్మములను పాటించుచు
నిత్యసుమంగళులై వర్థిల్లుచు ఉందురు.
అగ్నిప్రమాదములు గాని,
జలప్రమాద(మరణ)ములు గాని, వాయు
భయములుగాని లేకుండును. జ్వరాదిబాధలు, అట్లే
ఆకలిదప్పుల బాధలు, చోరభయములు
మచ్చుకైనను ఉండవు - (ఆధ్యాత్మిక - ఆధిదైవిక -
ఆధి భౌతిక బాధలు లేకుండును). రాజ్యములోని
నగరములు, ఇతర ప్రదేశములు ధనధాన్యములతో
పాడిపంటలతో తులతూగుచుండును. జనులు
కృతయుగమునందువలె ఎల్లవేళల సుఖశాంతులటో
వర్థిల్లుచుందురు. !
*****
శ్రీ రాముడు ; కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి