ఆకాశంలో! అచ్యుతుని రాజ్యశ్రీ
 ఆరోజు జయ అంది " టీచర్! నేను మనదేశంలోని మహిళా పైలెట్స్ గూర్చి వివరాలు చెప్తాను." శివా అన్నాడు " జయా! నీకు మహా గొప్పలు ఎక్కువ.మీనాన్న ఆటో డ్రైవర్.కానీ నీవు మాత్రం పైలెట్ కావాలని మహా ఆకాశానికి నిచ్చెనలు వేస్తాను!?" వెంటనే టీచర్ అంది" శివా! మీనాన్న మంత్రి గారి ఇంట్లో పని చేస్తాడని గురు ఎక్కువ.అబ్దుల్ కలాం పేపర్ బాయ్! మోదీజీ చాయ్ వాలా అని స్వయంగా చెప్పలేదా?" క్లాసంతా ఫక్కున నవ్వింది.జయ చెప్పింది " మానాన్న రోజూ ఆటోలో కూచుని పేపర్ చదివి నాకు చెప్తాడు.మనదేశంలో  17726 మంది రిజిష్టర్ చేయించుకున్న పైలెట్స్ లో మహిళా పైలెట్స్ 2764. విద్యార్ధినుల్ని ప్రోత్సహిస్తూ వచ్చారు.ఆర్ధికంగా వెనుక బడిన అమ్మాయిలకే ఛాన్స్ ఎక్కువ.ఫ్లైట్ ఆపరేషన్ లో ఉన్నత పదవులు ఇవ్వాలని చాలా సంస్థలు సిద్ధం గా ఉన్నాయి.ఏర్ ఇండియా స్పైస్ జెట్  గో ఏర్ వేస్. జెట్ ఎయిర్వేస్ సంస్థ ల్లో ఫ్లైట్ ఆపరేషన్ లో అమ్మాయిల కే అవకాశం బాగా ఉంది.1985లో సౌదామణి దేశ్ముఖ్ నేతృత్వంలో తొలి మహిళా ఫ్లైయింగ్ క్రూకలకత్తా నుంచి సిల్చార్ దాకా విమానం నడిపింది.అమెరికా ఆస్ట్రేలియా కన్నా మన అమ్మాయిలు రెట్టింపు.నావికాదళంలో 30 మంది మహిళలున్నారు." ఇక మా అబ్బాయిలకు ఉద్యోగాలు కష్టమే అన్న శివా మాటలకి అంతా ఫక్కున నవ్వారు🌹
కామెంట్‌లు