అట్టెం దత్తయ్య అని యూనివర్సిటీ స్కాలర్ మాకు మంచి మిత్రుడు. ఆయన మూసి పత్రిక లో సహాయ సంపాదకుడు గా పని చేస్తున్నాడు. అలాగే ఆయన ఆచార్య సాగి కమలాకర శర్మ గారి దగ్గర phd చేసి డాక్టరేట్ పట్టా పొందాడు ఈ మధ్య. అలాగే ఢిల్లీ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం సంపాదించాడు.
ఓ రెండేళ్ల కిందట మాకు ఫోన్ చేసి తాను ఒక ప్రాజెక్ట్ చేపట్టాననీ కొన్ని సిద్ధాంత గ్రంథాలను సేకరించి వాటిపై కొంతమంది స్కాలర్స్ చేత సమీక్షా వ్యాసాలు రాయించి వాటిని పుస్తకాలుగా అచ్చు వేయిస్తా అన్నాడు. అలా చెప్పి మా సీతాలక్ష్మి సిద్ధాంత గ్రంథం తెలుగులో లేఖా సాహిత్యం కూడా తీసుకున్నాడు.
కాలగర్భంలో రెండేళ్లు గడిచిపోయాయి. ఒక రోజు ఫోన్ చేసి
సిద్ధాంత సమీక్షా వ్యాసాలను రెండు సంపుటాలుగా వేశామని ఈ నెల అంటే అక్టోబర్ 28 నాడు పుస్తకాల ఆవిష్కరణ ఉందని చెప్పాడు.
అలా ఈనెల అక్టోబర్ 28వ తారీకు నాడు ఒకప్పడి ఓయూ పీహెచ్డీ స్కాలర్ attem దత్తయ్య సంపాదకత్వంలో వెలువడుతున్న సారాంశం అను రెండు రెండు వాల్యూమ్ లు 1200 పేజీల్లో ఒక్కొక్కటి 550 పుటలు ఆవిష్కరణ తెలంగాణ సారస్వత పరిషత్ లో జరిగింది. నాలుగు గంటల వరకు తయారై కారులో సారస్వతి పరిషత్ కు వెళ్లాం.
తెలంగాణలోని 110 మంది పీహెచ్డీ స్కాలర్స్ రాసిన సిద్ధాంత గ్రంథాలను మరో 85 వ్యాసకర్తల చేత సమీక్షా వ్యాసాలు రాయించి రెండు పుస్తకాలుగా వెలువరించారు దాంట్లో మా సీతాలక్ష్మి రాసిన తెలుగులో లేఖా సాహిత్యం అనే సిద్ధాంత గ్రంథాన్ని బెంగళూరు వాస్తవ్యులు ప్రముఖ కవి రచయిత ఘట్టమరాజు అశ్వత్థ నారాయణ గారు రాశారు 55 వ్యాసాలు చొప్పున రెండు పుస్తకాలు ఆవిష్కరించారు సభకు.... అధ్యక్షులు వహించగా తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై రెండు పుస్తకాలను ఆవిష్కరించారు
వచ్చిన ఆహుతులకు అందరికీ వేడి వేడి టి సరఫరా చేయబడింది సిద్ధాంత గ్రంథాలను సమీక్ష చేసిన వాళ్లందరికీ శాలు మెమేంటోతో సత్కరించారు. అసలైన గ్రంథ రచయిత రచయితలకు ఏమి సన్మానం గట్ల జరగలేదు. అత్యంత ఆప్తుడు మాకు ఉన్న స్నేహం దృష్ట్యా ఆయన మాకు ఒక్కొక్కటి రెండు గ్రంథాలు ఇచ్చారు. ఆ సభకు వచ్చిన యువభారతి ప్రస్తుత అధ్యక్షులు ఆచార్య ఫణీంద్ర గారు రేపు అనగా 29 అక్టోబర్ నాడు ఉదయం 9 గంటల నుండి యువభారతి వజ్రోత్సవ సభ జరుగుతుందని మీరు తప్పకుండా రావాలని కోరారు అంటే మళ్ళీ ఇదే పరిషత్ కు రేపొద్దున రావాలి
రాత్రికి ఇంటికి చేరే సరికి 11 గంటలు అయింది పరిషత్ లోని రాత్రి పది అయింది ఇంటికి వచ్చి అరటిపండు జ్యూస్ తాగి పడుకున్నాం
*
పొద్దున ఏడు గంటలకే లేచి రాత్రి గ్రహణం ఉండటం వలన గ్రహణ స్నానం చేసి తయారై 11 గంటలకల్లా పరిషత్ కు చేరుకున్నాం
నిజానికి ఈరోజు కూకట్పల్లిలో ప్రజ పద్యం సాహిత్య సంస్థ వారి ప్రోగ్రాం ఉంది అది కూడా పొద్దున 10 గంటల నుంచి రాత్రి వరకు ఉంది కానీ యువభారతి ఫణీంద్ర గారు కి మాట ఇవ్వడం వలన దీనికే రావడం జరిగింది ఉదయం 11 గంటలకు రాగానే వేడివేడి ఉప్మా తిన్నాం పొద్దున చాగంటి వారి ప్రవచనం చేసిన గ్రంథం శ్రీమత్ రామాయణం-మానవ సంబంధాలు ఆవిష్కరించబడింది హాల్లో టిఫిన్ చేస్తున్నప్పుడు యువభారతి కార్యదర్శి పరిచయం అయ్యారు.పేరు అడిగితే జీడిగుంట వెంకటరావు అని చెప్పాడు. ఎందుకో మా సీతమ్మ జీడికుంట రత్నమణి మీకేమవుతుందని అడిగింది. ఆమె మా సొంత చెల్లెలు అని చెప్పారు మా సీతకు ఆశ్చర్యం అయింది .ఎప్పుడు 1979 81 లో తనతో పాటు రత్నమణి ఎమ్మెలో క్లాస్ మెట్. M. Phil చేసేప్పుడే రాజమండ్రిలో పరిశోధన కోసం వెళ్ళినప్పుడు అప్పటికే అప్పటికి ఆమెకు పెళ్లి అయింది రాజమండ్రి గౌతమి గంధాలయంకు వెళ్ళినప్పుడు వాళ్ళింట్లోనే దిగారు ఎంతో చక్కటి మర్యాద చేసింది విచిత్రం ఏమిటంటే ఆమె మా హస్తినాపురం కి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఎల్బీనగర్కు దగ్గర్లో ఉన్న రాక్ హిల్స్ కాలనీలో ఉంటుందని తెలిసింది. మా సీతాలక్ష్మి ఆనందానికి ఇక హద్దు లేదు ఆయనతో వెంకట్రావు గారితో చాలా విషయాలు తన చదువుతున్నప్పటికీ సంగతులు ఎన్నో చెప్పింది మధ్యాహ్నం ఒకటిన్నరకు సాంబార్ అన్నం పెరుగన్నం రవ్వ కేసరి పెట్టారు శుభ్రంగా తిన్నాం. ఈ సభకు మా తోటి కవయత్రి మండపాక అరుణకుమారి మరియు మా చెల్లెలు తోడుకోడలు సత్యవతి కూడా వచ్చారు సాయంత్రం వరకు సభ జరిగింది.జీడిగుంట గారి కూతురు రత్నమణి సెల్ నం. ఇచ్చింది.
నాలుగున్నరకు రమణాచారి గారు వచ్చారు. యువభారతి వజ్రోత్సవ సంచికను ఆవిష్కరించారు. అలాగే నన్నయ పద్యాలతో కూడిన ఒక చిన్న పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు అలాగే యువభారతి అచ్చు వేసిన ఎన్నో పుస్తకాలను ఉచితంగా తీసుకోమని అక్కడ పెట్టారు సాయంత్రం ప్రోగ్రామ్ అయిన తర్వాత సత్యవతిని దింపుతా నన్నాము వాళ్ళింటిదగ్గర కారులో. ఈ లోపల తెలుగు రిటైర్డ్ హెడ్ డిపార్ట్మెంట్ నిత్యానందరావు గారు వస్తామంటే వారిని మా కారులో తీసుకుని వెళ్లి మా కాలనీకి దగ్గర్లో ఉన్న విరాట్ నగర్ లో దింపి ఇంటికి వచ్చేసాం.కారు నడిపేది ఎవరనుకున్నారు.మా సీతాలక్ష్మినే.
*
తెల్లారి సీతా లక్ష్మికి జీడిగుంట వెంకట్రావు గారి ద్వారా ఆ రత్నమణి అడ్రస్ తెలిసింది రేపు రమ్మనమని చెప్పింది రేపు పొద్దున రామంతాపూర్ లో ఐ చెకపు ఉంది వెళ్లాలి .సాయంత్రం రండి అని చెప్తే సీతా లక్ష్మి రామంతపూర్ లో ఎక్కడ? అని అడిగింది.రాఘవేంద్ర మఠం దగ్గర అని చెప్పింది.ఎలా వెళ్లారు ? అని అడిగితే క్యాబ్ లో వెళ్తాం అని చెప్పగా తమను నా కారులో తీసికెళ్తాను.మా అమ్మ వాళ్ళిల్లు కూడా అక్కడే.అమ్మను కూడా చూడొచ్చు.అమ్మకు 99 పూర్తయ్యాయి అని చెప్పింది సీత.అంటే MA చదివేప్పుడు ఇసామియా బజారులో ఉన్న సీతాలక్ష్మి వాళ్ళింటికి స్నేహితులు వచ్చేవారు.అందుకే అమ్మ తెలుసు. ఎన్నింటికీ వెళ్ళాలి అంటే డాక్టరు 11.30కు టైం ఇచ్చాడు అని చెప్పగా ఎప్పుడెప్పుడు రత్నను చూస్తానో అన్న సీతకు మంచి అవకాశం దొరికింది కాబట్టి రామంతపూర్ కు తీసుకెళ్తానని సరిగ్గా ఉదయం 10.30 వస్తానని చెప్పింది.
తన చిన్ననాటి స్నేహితురాలు రత్నమణిని కలుస్తామన్న సంతోషము ఉత్సాహం ఆమెను ఆమె కాలు నిలవనీయటం లేదు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు మా రత్నమణి చూద్దామా అని రాత్రి సరిగా నిద్రపోనేలేదు
*
31.10.23.
ఎప్పుడెప్పుడు అని సీతమ్మ ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. తెల్లారిపోయింది. స్నానం చేసి రెడీ అయ్యి నాలుగు బ్రెడ్ స్లైసులు తిని కారులో ఎల్బీనగర్ రాక్ హిల్స్ కాలనీ బయలుదేరాం .. అప్పుడు నాకు ఇద్దరు మిత్రులు సినిమాలోని పాట ఎన్నాళ్ళో వేచిన ఉదయం
ఈనాడే ఎదురౌతుంటే
అని శోభన్ బాబు కృష్ణ ల పాట గుర్తుకొచ్చింది.అలకాపురి చౌరస్తా నుంచి యూటర్న్ తీసుకుని రిలయన్స్ పెట్రోల్ పంపు దగ్గర నిలబడితే ఎక్కించుకుని సీదా రామంతాపూర్ లో మా అత్తగారింటికి వచ్చాము.
కారు అక్కడ పార్కు చేసి వారిని
వాళ్ల ఫ్యామిలీ ఐ స్పెషలిస్ట్ విట్టల్ రావు గారి దగ్గరికి తీసుకెళ్లాను. వాళ్ళను అక్కడ దింపి ఇంటికి వచ్చేసాను. మేము వస్తూ ఒక ప్లేట్ ఇడ్లీ తెచ్చుకుంటే దాంట్లో రెండు నేను తిన్నాను. మిగతా రెండు సీత వాళ్ళ అమ్మకి పెట్టింది పొద్దున నాలుగు బ్రెడ్ లు తిన్నాం కదా కడుపు నిండిపోయింది అని అంది. అది వాళ్ళ అమ్మ మీద ఉన్న ప్రేమ.
పొద్దున్నే సీతకు కందుకూరి ఫోన్ చేసి నేను అమ్మ దగ్గరికి 12.30 కు వస్తాను.మీరు ఉండండి నేను వచ్చేవరకు అన్నాడు.
వాళ్ళ ఇంకో క్లాస్మేట్ కందుకూరి శ్రీరాములు ప్రముఖకవి ఆటో చేసుకుని ఆదరాబాదరగా మా అత్తగారింటికి వచ్చేసాడు.
వాళ్ళ ముగ్గురు ముచ్చట్లు పెట్టుకున్నారు 40 ఏళ్ల కిందటి కాలేజీ విషయాలు తవ్వుక్కున్నారు. ఇకఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు వాళ్ళ ఇతర క్లాస్మేట్లు సంయుక్త గజేందర్ ఇంకా కొంతమంది మిత్రులు ఫోన్ చేసి సీత రత్నమణిని కలిసింది .రత్నను కలిసింది అని చాటింపు వేసింది మా అత్తగారింట్లో గ్యాస్ అయిపోయింది టీ పెడదామంటే
ఈలోపు బయటికి వెళ్లి మాజా కూల్ డ్రింక్ తెచ్చాం తెచ్చి తల ఒక గ్లాసులో పోసుకొని అందరం తాగాం.
కారులో వయా భరత్ నగర్ డీమార్ట్ మీదుగా ఎల్బీనగర్ రోడ్ లోని రాక్ హిల్స్ కాలనీలోని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. రత్నమణి వాళ్ళ నాన్న ఇచ్చిన 500 గజాల స్థలము డెవలప్మెంట్ ఇస్తే వాళ్లకు నాలుగు అపార్ట్మెంట్లు వచ్చాయని అన్నదమ్ములు తో కలిసి ఇక్కడే ఉంటున్నానని చెప్పింది
రత్నమణి వాళ్ళది థర్డ్ ఫ్లోర్
వాళ్ళ అన్నయ్య జీడిగుంట వెంకట్రావు గారు 4వ ఫ్లోర్ లో ఉంటారు.
పై ఫ్లోర్లులో ఉన్న
వాళ్ల అన్నయ్య కూడా వచ్చి పలకరించి వెళ్ళాడు.
కొంచెం తలకాయ నొప్పిగా ఉంది అని స్వతంత్రంగా అడిగి టీ పెట్టించుకుని తాగాను.
తర్వాత అందరం కలిసి కూర పప్పు ఆవకాయ అప్పడాల తోటి వేడివేడిగా భోజనాలు చేశాం వాళ్ళ ఆవకాయ చాలా బాగుంది సున్ని కందిపొడిలో నెయ్యి వేసుకుని తిన్నాం. అద్భుతంగా ఉంది.
తర్వాత తిన్నాక మామూలుగా నాకు అలవాటే కదా నిద్ర ముంచుకొచ్చింది చిన్నగా వాళ్ళ బెడ్ రూమ్ లోకి వెళ్లి ఒరిగాను, నిద్ర పట్టేసింది. సాయంత్రం ఐదున్నర అయింది నిజానికి నాలుగు గంటలకు వెళ్లి మా ఇంట్లో నీళ్లు పట్టాలి ఆ పని మా టెన్నంట్ వేణుకు అప్పజెప్పిన. సాయంత్రం 5:30 కు లేచాక వాళ్ళు ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉన్నారు. శ్రీరాములు కూడా ఓపిగ్గా సాయంత్రం వరకు ఉన్నాడు క్లాస్ మేట్స్ అందరికి ఒక్కొక్కళ్లకు ఫోన్ కలిపి మాట్లాడించింది మా సీతమ్మ.
సాయంత్రం టీ తాగి వాళ్లకు బై బై చెప్పేసి కారులో ముగ్గురం బయలుదేరగా శ్రీరాములును ఎల్బీనగర్ క్రాస్ రోడ్లు దింపి మేము ఇంటికి వచ్చేసాం.
ఒక 40 ఏళ్ల తర్వాత కలిసిన తన చిన్ననాటి స్నేహితురాలు చూసి సీతమ్మ కళ్ళలోని ఆనందం ఎంత వర్ణించినా తక్కువే..
రత్నమణి వాళ్ళ భర్త ఎస్బిఐలో ఆఫీసర్ గా చేసి రిటైర్ అయ్యారు. వాళ్ల అత్తగారికి ఇష్టం లేదని ఉద్యోగం చేయటం ఇష్టం లేదని డిగ్రీ కళాశాలలో ఎయిడెడ్ లెక్చరర్ గా ఉద్యోగం వచ్చినప్పటికీ. తన అత్తగారికి ఇష్టం లేక తాను ఒక గృహిణిగా మిగిలిపోయాయని నేనో సోమదమ్మనుఅంటూ ఆవిడ ఎంతో బాధగా చెప్పారు
ఏమైనాప్పటికీ 2015 లో ఎల్బీనగర్ వచ్చి సెటిల్ అయినా రత్నమణి కుటుంబం దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈరోజు కలవటం కాకతాళీయం . ఎంతో గొప్ప విషయం 2016లో మా పెద్దమ్మాయి పెళ్లి ఆ ఏరియాలో జరిగింది 2018లో చిన్నమ్మాయి పెళ్లి కూడా ఆ ప్రాంతంలోనే జరిగింది ముందే కనుక రత్నమణి అక్కడ ఉన్నట్టు తెలిస్తే ఆ రెండు పెళ్లిళ్లకు తప్పనిసరిగా వచ్చేది
ఈరోజు రాత్రి ఇంటికి వచ్చినా కూడా రత్నమణి విశేషాలు, కాలేజీ ముచ్చట్లు అన్ని చెబుతూ సీతాలక్ష్మి ఏ రాత్రికో నిద్రపోయింది.
రక్తసంబంధం కన్నా ఒక్కోసారి స్నేహబంధం ఎంత గొప్పదో కదా పెద్దవాళ్లు చెప్పినట్లుగా.....
ఈరోజు సహారా దగ్గర ఒక కనిమిత్రుని ఇంటికి వెళ్లి అక్కడకు కాస్త దగ్గరే కదా అనుకుని రత్నమణి ఇంటికి వెళ్లి కలసి ఓ కప్పు కాఫీ ఇస్తే తాగి వచ్చాం.
అనుబంధాల,అనురాగాలు తగ్గుతున్న నేటి కాలంలో ఇదీ మా స్నేహబంధం విలువ.
--------------
చెరగని స్నేహం;- పరిమి వెంకట సత్యమూర్తి- డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి