ఋణం;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 నా ఆనందక్షణాలకోసం
నీ జీవితపు ఘడియల్ని
నాకోసం ఖర్చు చేస్తావ్
అంతేనా....ఊ...హూ....
హేమంత సమీరాల్ని
నీహారికా బిందువుల్ని
వెన్నెల రాత్రుల్ని
శీతాకాలపు ఉషోదయాల్ని
వేసవికాలపు సాయంత్రాల్ని
పులకింతను
ప్రేమను
ముఖ్యంగా
నిన్ను నువ్వు నాకిచ్చి.....
ఎలా తీర్చుకోగలనో
నీ ఋణం !!
*********************************

కామెంట్‌లు