"యోచించిన, మది పరవసించును ! ";- కోరాడ నరసింహా రావు.
రోజున కిరువురు ఏలికలై... 
 పా లించుచున్నారు ఈ జగతి !

పగలుకు ప్రభువు దినకరుడు 
 రేయి కేమో నిసీశ్వరుడు... !!

సకల ప్రాణులకు,ఈ ఉష - నిసి 
  పూరకమ్ములే యగుచున్నవి !

కలిమి, లేములు... సుఖ,దుఃఖ ములకుప్రతీకలీ..చీకటి,వెలుగులు !

వెలుగు వీరునిది ఎదిరి పోరే... 
  చీకటిదెపుడూ వెన్నుపోటే.. !!

వెలుగును చూసిన తోక ముడియు నీచీకటి!
 చీ కటికి చిక్కక,స్థిరముగ నిలుచును  మహా వీరుడీ   క్రాంతి కిరీటి !! 

,ఈ చీకటి, వెలుగుల దొంగాటలో... 
  ఎవరూ... ఎవరికీ  చిక్కని కిలాడీలే !

ఈ ఆటతోనే... భూగోళము 
   అవిశ్రాoత ముగ భ్రమిస్తూ 
పగలు - రేయికి కారణ మాయెను !

ఆనందముతో... కలసి ఆడుటకు... ఆ చంద్రుడునూ 
 భూమి చుట్టూతా పరిభ్రమిస్తూ 
  పక్షములకు ... తిధులకునూ  
 కారణ భూతుడు అగుచున్నాడు !!

ఇంతవింతయగుఈఅత్యద్భుత చిత్రకారుడా సర్వేశ్వరుడు, ఎంత చతురుడో.... !!

యోచించిన మది, పరవసించును..., 
   వినమ్ర ముగా  నమస్కరించును !!
     ********

కామెంట్‌లు