సైనికులు! అచ్యుతుని రాజ్యశ్రీ
 పిల్లలు హడావిడిగా స్లిప్ టెస్ట్ కి తయారు అవుతున్నారు.టీచర్ రాగానే " ప్లీజ్! మేము లాస్ట్ పీరియడ్ లో రాస్తాం టీచర్.ఇప్పుడు లెక్కలు చేసుకుంటాం" అని గగ్గోలు పెడుతున్నారు.టీచర్ అంది" లెవెన్త్ అవర్ ప్రిపరేషన్ వద్దు.మనసైనికులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి అలా ఉంటారు కూడా.ఒక సైనికుడు సెలవులకు వచ్చి ఓనెల కుటుంబం తో హాయిగా గడిపాడు.ఆరోజు ప్రయాణం." నాన్నా! మళ్ళీ ఎప్పుడు వస్తావు!?" " నేను యుద్ధం సరిహద్దు లో గందరగోళం లేకుండా ఉంటే మన జాతీయ పతాకం తో ఆనందం గా వస్తాను.హఠాత్తుగా టెర్రరిస్టులు  తెగబడితే నేను పోరాడుతూ పతాకంలో చుట్టబడి పెట్టెలో భద్రంగా ఇల్లు చేరుతాను." ఆపిల్లల అమాయకత్వం చూడండి.నాన్న జెండా తో వస్తాడు" అని ఆనందించారు." అంతే టీచర్ మాటలు వినగానే స్లిప్ టెస్ట్ రాయటానికి సిద్ధం అయ్యారు 🌷
కామెంట్‌లు