ము అక్షరముతో (బాల గేయం);- ఎడ్ల లక్ష్మి
మువ్వల బండి వచ్చింది
ముంగిలి ముందు ఆగింది
మురిపాలకృష్ణుడొచ్చిండు
ముసి ముసిగా నవ్విండు

మురిపాలెన్నో పంచిండు
ముదము తోడ నిలిచిండు
ముద్దు ముద్దుగా పలికిండు
ముద్దులు ఎన్నో ఇచ్చిండు

ముల్లెలు కట్టి తెచ్చిండు
ముత్యాలన్ని విప్పిండు
ముంగిటిలోన చల్లిండు
ముత్యాలమ్మ చూసింది

మునగా పూలు తెంపింది
మురిపకంగా చల్లింది
మునులందరు వచ్చారు
ముద్దుల కన్నకు మొక్కారు

కామెంట్‌లు