రాధా దేవి .; డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు .

 శ్రీకృష్ణుని  లీలలు అనంతం.ఒకచోట యజ్ఞంలో,మరోచోట స్నానమాడుతూ, వెరొకచోట దానంచేస్తూ,చంద్రవదన వద్ద తాంబూలం సేవిస్తూ,వనాజాక్షితో సంభాషిస్తూ,ఒభార్య వద్ద భోజనం చేస్తూ ఒక్కసారిగా పలు ప్రాంతాలలో కనిపించే శ్రీకృష్ణుని లీలలు అనంతం.
రాధాదేవి అవతరణకు సంబంధించిన విషయాలను గర్గసంహిత గోలోక ఖండం వివరిస్తుంది. ' బహుళాశ్వుడు '  అనే రాజుకు నారదమహర్షి ఈవిషయాలు వివరించాడు.' వృషభానుడు ' భార్య అయిన ' కీర్తి ' గర్బంలో '  రాధ ' జన్మించేలా చేసాడు కృష్ణుడు.అంతటి గొప్పభాగ్యం పొందిన వృషభానుడు కీర్తి ... గత జన్మలో ఎవరు అనేది నారదుడు వివరించాడు. 
' నృగ ' మహారాజుకు' సుచంద్రుడు' అనే కుమారుడు జన్మించాడు.అతనికి ' కళావతి ' తొ వివాహం జరిగింది.చాలాకాలం వరకు వారికి సంతానం కలగలేదు.ఆ దంపతులు గోమతి నదీ తీరంలోని నైమిశారణ్యం వెళ్లారు. సంతానంకొరకు బ్రహ్మదేవుని తలచి కఠోర తపస్సు చేసారు. వీరి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై సుచీంద్రుడు సంతానాన్ని కోరగా,ద్వాపరరాంతంలో మీరు గంగా యమునల సమీపంలో జన్మించి మీరు మరలా దంపతులుగా మారతారని అప్పుడు జగత్ జనని రాధాదేవిగా వారికి జన్మింస్తుందని వరంఇచ్చాడు బ్రహ్మదేవుడు. కాలాంతరంలో కళావతి కన్యాకుబ్జ దేశరాజు ' జలనందనుడు ' యజ్ఞ కుండంనుండి ఆవిర్బవించి ' కీర్తి '  పేరున పెరిగింది.' సురభానుడు '
అనే రాజు కుమారుడిగా సుచింద్రుడు ' వృషభానుడు ' పేరిట జన్మించాడు.వృషభానుడు,కళావతులు పూర్వజన్మజ్ఞానంతో పెరిగారు.అనంతరం వీరివివాహం జరిగింది.ఈదంపతులకు కలలో రాధాదేవి  కనిపించి బాద్రపదమాసం శుక్లపక్ష అష్టమి తిధిన వేకువన తను ఆకాశంనుండి రెండేళ్ల పాపగా దిగి మీయింటికి వస్తానని చెప్పింది.చెప్పినట్లే శ్రీకృష్ణునిరాధా దేవి ' రావల్ ' గ్రామం లో అవతరించింది.
కొందరు వైష్ణవులు రాధను శక్తి అవతారంగా భావిస్తారు. భారతదేశంలో రాధాకృష్ణులకు చాలా దేవాలయాలు ఉన్నాయి.రాధాకృష్ణులను ప్రేమకు చిహ్నాలుగా ఎంతోమంది కవులు, చిత్రకారులు కొన్నిశతాబ్ధాలుగా వర్ణిస్తూ, చిత్రీకరిస్తూనే వున్నారు.ఈమెకు రాధిక, రాధే, మాధవి, కేశవి, రాధేశ్వరి, కిషోరి,శ్యామా, రాధారాణి అని కూడా పిలుస్తారు.పురాణాల ప్రకారం రాధాదేవిని లక్ష్మీదేవి అవతారంగా వర్ణించారు.రాధా దేవిని మహా లక్ష్మి దేవి యొక్క పూర్ణ అవతారంగా వర్ణించారు మరియు ఆమె శ్రీకృష్ణుని భార్య. బ్రహ్మ వివర్త పురాణం ప్రకారం రాధ మరియు కృష్ణ బ్రహ్మదేవుని సమక్షంలో బృందావనంలోని భండిర్వణంలో వివాహం చేసుకున్నారు . హిందూ మతంలో ముఖ్యంగా గౌడియా వైష్ణవ సంప్రదాయంలో రాధ ప్రసిద్ది చెందిన దేవతగా ఆరాధించబడింది. ప్రేమ, సున్నితత్వం, కరుణ భక్తికి మారుపేరుగా భావిస్తారు.ఆమె శ్రీకృష్ణుని శాశ్వత భార్య, అతనితో వారి శాశ్వత నివాసం గోలోకాధామంలో నివసిస్తుంది. ఆమె కృష్ణుడి అంతర్గత శక్తి లేదా హ్లాదిని శక్తి (ఆనంద శక్తి)గా చెపుతారు.
ఆమె శ్రీ కృష్ణుడికి (భక్తి దేవి) పూర్తి భక్తి (పారా భక్తి) వ్యక్తిత్వం, కృష్ణుడి పట్ల నిస్వార్థ ప్రేమ, సేవలతో సారాంశంగా గౌరవించబడుతుంది.ఆమె కూడా కృష్ణుడి స్త్రీ రూపంగా కొందరు భావిస్తారు. ప్రతి సంవత్సరం రాధారాణి పుట్టినరోజును రాధాష్టమిగా జరుపుకుంటారు.ఆమెను కొంతమంది మానవ ఆత్మకు ప్రతి రూపకంగా భావిస్తారు. శ్రీకృష్ణుడి పట్ల ఆమెకున్న ప్రేమ, వాంఛను ఆధ్యాత్మిక వృద్ధి, దైవిక (బ్రాహ్మణ) తో ఐక్యత కోసం మానవ తపనకు ప్రతీకగా వేదాంతపరంగా చూస్తారు.ఆమె అనేక సాహిత్య రచనలను ప్రేరేపించింది. కృష్ణుడితో ఆమె రాసలీల నృత్యం అనేక రకాల ప్రదర్శన కళలకు ప్రేరణనిచ్చింది.ఆమెను బృందావనేశ్వరి (శ్రీ బృందావన్ ధామ్ రాణి) అని కూడా పిలుస్తారు.ఆమె వైష్ణవ మతంలో పరమ దేవత. భగవంతుడు శ్రీ కృష్ణుడి ప్రధాన శక్తి అయిన యోగామయ, హ్లాదిని శక్తి (దైవ ప్రేమ శక్తి) అసలు రూపం ఆమెను పేర్కొన్నారు.రాధను భారతదేశంలో ముఖ్యంగా గౌడియా వైష్ణవులు పూజిస్తారు.ఆమె నింబార్కా సంప్రాదాయ, శ్రీ చైతన్య మహాప్రభుతో ముడిపడి ఉన్న ఉద్యమాలలో ఎక్కువుగా గౌరవించబడుతుంది.
కృష్ణుడికి ప్రియమైన గోపి పేరు రాధ. జయదేవ గోస్వామి రాసిన గీత గోవిందలో రాధా, కృష్ణ ఇద్దరూ ప్రధాన పాత్రలు.హిట్ హరివంష్, స్వామి హరిదాస్ పుస్తకాలలో రాధాను ప్రధాన దేవతగా వర్ణించాయి.ఇక్కడ రాధా లక్ష్మి అవతారం కాదు. శ్రీ కృష్ణుడి స్వరూపం. దేవి భాగవతం, బ్రహ్మ వైవర్త పురాణాలలో రాధను గోపికల మూలంగా అనంతమైన ఆత్మల తల్లిగా వర్ణించారు.నారద-పంచరాత్రలో "రాధా గోకులేశ్వరి, ఆకస్మిక ప్రేమ పూర్తి స్వరూపం, మహాభావ [అత్యున్నత ఆధ్యాత్మిక స్థితి] స్వరూపం. భగవాన్ శ్రీ కృష్ణుడు అన్ని ఉనికి అత్యున్నత ఈశ్వరుడు, దేవతల మధ్య దేవుడు. ఆమె దయ శ్రీ రాధా కృష్ణుడి అంతర్గత శక్తి, ఆమె తన అత్యంత ప్రియమైన శ్రీ కృష్ణుని ఆరాధనను ఆమె భక్తి, సేవ మొత్తం సంపదతో చేస్తుంది. " అని చెప్పబడింది

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం