అతి వేగంగా కాలం మారిపోతోంది. సామాన్య జీవితాలు సైతం వేగం పుంజుకుంటున్నాయి. అన్ని జీవితాలు పరుగుల జీవితాలు అయిపోతున్నాయి. అంతేకాక, ఎవరి జీవితం వారిదిగా మారిపోతోంది. ఈ నేపధ్యంలో మానవులకు సంస్కార వైభవం తిరోగమన దిశగా సాగుతుండడం ఒకింత బాధాకరం.
భగవాన్ శ్రీ సత్యసాయి ఒక ప్రవచనంలో "ప్రకృతి మానవులకు మొదటి గురువు. పుట్టినప్పుడు మనిషి జంతువు లాంటివాడు. పెరగుదల క్రమంలో తల్లిదండ్రులు పిల్లల మానవ సామర్థ్యాలను ఎలా అభివృద్ధి చేయాలో నేర్పుతారు. పురాతన ఋషులు పిల్లలలో మానవ లక్షణాలను పెంపొందించుకోవడం సరిపోదని భావించి పిల్లల ఆధ్యాత్మిక అభివృద్ధికి సంస్కారాల (సాంస్కృతిక శిక్షణ) వ్యవస్థను రూపొందించారు. సంస్కారాలు మానవ లక్షణాలను మరింతగా పెంపొందించడమే కాకుండా మనిషిలోని జంతు స్వభావం యొక్క అన్ని అవశేషాలను తొలగించడానికి కూడా ఉద్దేశించబడ్డాయి" అని ప్రభోదించారు. మానవులు ప్రపంచంలో ఏదైనా సాధించాలంటే, మూడు విషయాలు అనగా ఇంద్రియాలపై పట్టు- , మనస్సుపై నియంత్రణ మరియు సంపూర్ణ శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అవసరం అని శాస్త్రం చెబుతోంది. “సంస్కార” అనే సంస్కృత పదం రెండు మూల పదాలతో రూపొందించబడింది - “ సం ” అంటే పూర్తి, కలిసినది మరియు “ కార ” అంటే చర్య, కారణం లేదా చేయడం. ఈ విధంగా, సంస్కారం అనేది మీ మనస్సు గత చర్యలు లేదా కొంత కాలం పాటు మీరు అనుభవించే ఆలోచనల ద్వారా పొందే మానసిక ముద్ర.
నేడు మనిషి చిన్నచిన్న వస్తువులను కూడా సాధించలేక పోతున్నాడంటే, వీటన్నింటిలో లోపమే కారణం. ఈ మూడింటిని పొందాలంటే మనిషి ఋషులు నిర్దేశించిన ధర్మాన్ని ఆచరించాలి. ప్రపంచంలో అనేక ప్రతికూల ధోరణులు చోటు చేసుకుంటున్న వారి పెంపకం మీద మరింతగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. చదువులతోపాటు పిల్లలకు సంస్కారాన్ని నేర్పడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. వారిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దడం అన్నది వారికి ఊహ తెలిసిన వయసు నుంచే ప్రారంభం కావాల్సి ఉంటుంది.మనిషికి సరైన వైఖరి, విశ్వాసం ఉంటే నిస్సహాయ పరిస్థితుల్లో సైతం అత్యద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. సహనం నిండుగా ఉంటే దైవబలంతోడై కొండలను సైతం కదిలించవచ్చునని గ్రహించాలి. ఇటువంటి సంస్కారాలను ప్రతీ ఒక్కరు అలవరచుకోవడంతో పాటు మన పిల్లలకు కూడా నేర్పించడం ఎంతో అవసరం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి