శబ్దసంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 స్వాంగ్ ప్రచులిత అర్థం కృత్రిమ రూపధారణ. ఇది జానపదనాట్యంలో ఒకరూపం.పల్లెల్లోఎన్నో జాతుల వారు కల్సిసామూహిక నృత్యం గా చేస్తారు.ఇది హాస్య శృంగార పరంగా ఉంటుంది.రామలీలా లో రామలక్ష్మణుల శకుంతల దుష్యంతుల స్వాంగ్.ఒక్కోసారి ఇతరుల్ని ఎగతాళి చేయడానికి 
హాస్యం పుట్టించడానికి స్వాంగ్ అంటే ఇతరుల వేషధారణ తో వస్తారు.బాల్య వృద్ధవివాహాలను వెక్కిరిస్తూ చేయడం ఏదో వంకతో ఇతరులను భ్రమలో పడేయటం  తమపని పూర్తి చేయాలని దొంగ వేషాలు వేయడం ఒంట్లో బాగా లేదు అని పనికి డుమ్మా కొట్టడం ఇలాంటివి నాట్యకల్పదృష్టిలో స్వాంగ్ అంటారు.భాణ భణిక ప్రహసనం స్వాంగ్.. దాదాపు ఇవన్నీ ఒకే రకం ప్రక్రియలుస్వామి అంటే ప్రభువు ఈశ్వరుడు.రాధాస్వామి సంప్రదాయం లోఈపదం ఎక్కువ గా వాడుక లో ఉంది.భగవంతుడ్ని స్వామి అంటారు.దీని అపభ్రంశరూపం సాయి.సాయి పదప్రయోగంని
నిర్గుణ సాధువులు ఈశ్వరుడికి ప్రయోగిస్తారు.జైనుల 11వతీర్ధంకరుని స్వామి అన్నారు.హిందూసన్యాసులని స్వామీజీ అని సంబోధిస్తారు.స్వామి వివేకానంద స్వామి రామానంద ఇలా అన్నమాట.సింధీ సమాజంలో ఏవ్యక్తినైనా సాయి అనే అంటారు.అందుకే ఇతరులు కూడా సింధీలను సాయి అనే సంబోధిస్తారు.
స్థితప్రజ్ఞత అంటే అన్ని రకాల మనోభావాలను త్యాగం చేయడం.తన ఆత్మ ను సంతుష్టి గా ఉంచటం.దుఃఖాలకి ఉద్విగ్నం కాకుండా సుఖాలప్పుడు కామనలు కోరికలు లేకుండా రాగభయక్రోధాలు లేని వాడిని స్థితధీ స్థితప్రజ్ఞముని అంటారు.
హంతా అంటే హనన్ లేక హత్య చేసేవాడు అని అర్థం.హంతా అనేపదం కన్నా హత్యారా అని వాడతారు హిందీ లో.పితృహంతా అని హిందీలో పితృహంతకుడని తెలుగు లో అంటాం
హకీం అరబిక్ పదం.అనేకవిషయాలు దర్శన శాస్త్రం లో పండితుడు.యూనానీ వైద్యుడిని హకీం అంటారు.
హజారీ ఫారశీ పదం.ఓవెయ్యి మంది సిపాయిల సర్దార్ అని అర్థం.మొగలులకాలంలో సర్దార్లకి హజారీ అనే పదవి హోదా లభించింది.వేలాది రూపాయల సంపత్తి ఉన్న వాడిని హజారీ అనే వారు.
హఠయోగం అంటే ఇంద్రియ నిగ్రహం చాలా కఠినాతికఠినంగా చేయడం.హఠయోగంలోధ్యానం ప్రాణాయామం ద్వారా కుండలినీ జాగృతం చేసి బ్రహ్మ రంధ్రందాకా పోగలస్థితికి చేరుతాడు.ఈశ్వరప్రాప్తికై నేతి ధోతీ కఠినముద్రలవేయటం ప్రధాన అంశం.హఠయోగి శరీరంలోపల కుండలినీ ఇంకా అనేక రకాల చక్రాలప్రయోగం తో యోగిగా ఆత్మానందం పొందుతాడు.హఠయోగంలోపెద్దకీర్తి ప్రతిష్ఠలు ఉన్న వాడుఆచార్య యోగి మత్స్యేంద్రనాధ్.మఛందర్ నాధ్ అని కూడా పేరు.అతనిశిష్యుడుగోరఖ్ నాధ్.ఇతని అనుయాయులను 
నాథ్ యోగులు అని అంటారు.బౌద్ధులుకూడా హఠయోగం ని అవలంబించారు 🌹
కామెంట్‌లు