అందచందాలచంద్రుడు
అందరికిమామయతడు
వన్నెచిన్నెలున్నవాడు
వెన్నెలనువిసురువాడు
నీలిగగనమెక్కువాడు
నింగిలోననిలుచువాడు
ప్రేమజ్వాలరగిలించువాడు
ప్రియరాగాలుపలికించువాడు
అశ్వినితో
మాసయాత్రమొదలెట్టువాడు
రేవతితో
నెలపయనముముగించువాడు
పగలు
సేదతీరువాడు
రాత్రులు
రాసక్రీడలాడువాడు
శుక్లపక్షాన
పెరుగుతాడు
కృష్ణపక్షాన
తరుగుతాడు
అమవాస్యనాడు
అసలే కనపడడు
పౌర్ణమిరోజు
పూర్తిగా వెలుగుతాడు
నల్లమచ్చలున్నా
తెల్లగానుంటాడు
చల్లనివెన్నెలను
చల్లుతూయుంటాడు
మనసులను
మురిపిస్తుంటాడు
తనువులను
తృప్తిపరుస్తుంటాడు
చంటిపిల్లలను
ఆడిస్తుంటాడు
యువతియువకులను
పాడిస్తుంటాడు
మబ్బులతో
దోబూచులాడుతాడు
తారకలతో
సయ్యాటలాడుతాడు
నీటిలో
ప్రతిబింబిస్తుంటాడు
చెట్లలో
తొంగిచూస్తుంటాడు
పగలు
దాగుకుంటాడు
రాత్రిల్లు
కనబడిపోతుంటాడు
భూమిచుట్టూ
తిరుగుతుంటాడు
సూర్యునుచుట్టూ
భ్రమిస్తుంటాడు
ఈకవనము
మీకానందమునిస్తే
నాలక్ష్యము
నిండుగానెరవెరినట్లే
ఈకవిత
మీమదులతడితే
నాశ్రమ
ఫలించినట్లే
భావకవిగా
భుజాలెగరేస్తా
తెలుగుకవిగా
తేనెనుచిందిస్తా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి