విద్యార్ధులలో కనీస అభ్యసన స్థాయి లక్ష్యంగా మనమంతా కృషి చేయాలని తలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉప్పాడ అప్పారావు అన్నారు. పాఠశాలలో
అభ్యసనాభివృద్ధి కార్యక్రమం (లిప్) రెండు రోజుల శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ధారాళంగా చదవడం, చదివిన అంశాలపట్ల అవగాహన కలిగియుండుటయే ఈ అభ్యసనాభివృద్ధి కార్యక్రమ ఆవశ్యకత అని అన్నారు.
వీరఘట్టం, పాలకొండ మండలాలకు చెందిన సాంఘిక శాస్త్రోపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జిల్లా రిసోర్స్ పర్సన్ లుగా బౌరోతు మల్లేశ్వరరావు, వూలక రవి, మాచర్ల రఘునాథదొర, పోతురాజు శంకరరావులు వ్యవహరించారు.
ఉపాధ్యాయులు పాఠాన్ని బోధించేటప్పుడు విద్యార్థుల పూర్వభావన నైపుణ్యాలను, కీలక భావనలను, మైండ్ మ్యాపింగ్, పాఠ్యాంశం పట్ల సమగ్రమైన భావనలను అందించే అంశాలు కీలకమైనవని ఈ శిక్షణలో వివరించారు. ఈ లిప్ కార్యక్రమం పట్ల ఉపాధ్యాయులకు గల అవగాహనను ఆన్ లైన్ ద్వారా పరీక్షను నిర్వహించారు. వెంటనే యాప్ ల ద్వారా నివేదించారు.
నమూనాగా ఒక పాఠ్యాంశాన్ని తీసుకుని, ఈ లిప్ కార్యక్రమం అనుసంధానిస్తూ ఏమేరకు తరగతి గదిలో అమలుపర్చుతారో కృత్యాన్ని నిర్వహించారు. అభ్యసనాభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన పలు కీలక అంశాలను ఎస్.ఆర్.జి. కట్టోజు జనార్ధనరావు వివరించారు. కుదమ తిరుమలరావు ప్రత్యేకగీతాలను ఆలపించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి