శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 హిందీ లో సంస్కృతి అంటే వ్యక్తి జాతి దేశంకి సంబంధించిన మనసు అభిరుచి ఆచారాలు భావాలు కళాకౌశలం సభ్యత నాగరికత..ఇలా అన్ని రంగాల్లో బౌద్ధిక వికాసం అని అర్థం.ఆంగ్లంలో కల్చర్ అంటారు.కానీ సంస్కృతంలో దీని అర్థం ఇది కాదు.కల్చర్ అంటే తయారు కావటం తయారు చేయడం.వాజసనేయి సంహిత ఐతరేయ బ్రాహ్మణం లో ఈ అర్థం చెప్పారు.సంస్కృతంలో దీని అర్థం శుద్ధి చేయడం పవిత్రం చేయు.సంస్కార్ సంస్కరణలో ఇదే అర్థం.కల్చర్ సంస్కృతి లో సారూప్యం సాదృశ్యం ఉంది.లాటిన్ కల్చరా నుంచి ఆంగ్ల కల్చర్ వచ్చింది.దీని మూలార్ధం దున్నటం మొక్కలు నాటడం పశుపాలన.క్రమంగా దీని అర్ధం విస్తరించింది.కల్చర్ అంటే అభ్యాసం చేయడం మస్తిష్కం దాని శక్తుల్ని వికసించేలా చేయడం.శిక్షణ చదువు తో మానసిక ప్రవృత్తి లో మంచి మార్పులు చేర్పులు చేయడం.సంస్కారంద్వారా మంచి మార్పులు తేవడం.హిందువుల్లో 16 ధార్మిక సంస్కారాలు ఉన్నాయి.మనిషి తన జీవితంని అందంగా ప్రశాంతంగా ఆనందం గా ఉంచుకోవడం కోసం కష్టపడాలి.ఉన్నత ఆదర్శాలు కళలు ఆచారసాంప్రదాయాలుసమిష్టిగా ఉంటే అది సంస్కృతి.శరీరం మనసు పరిశుద్ధంగా ఉంచుకుంటూ తన వికాసం తో పాటు సమాజం యొక్క అభ్యున్నతికి కృషి చేయాలి.ఏదేశ సంస్కృతి ఐనా వారి నివాసం జీవనశైలి పరంపరాగతంగా అనుభవాలు పరిగణనలోకి వస్తాయి.కొత్త పనిముట్లు ఉత్పాదక సాధనాలు సామాజిక రాజకీయ సంస్థల చైతన్యం అని చెప్పవచ్చు.మనిషి జీవితం ఆధునిక శైలివల్ల పని సులభం అవుతుంది.కళాత్మకత సృజనాత్మకత అన్నీ కలిస్తేనే సంస్కృతి.ప్రపంచంలో భారతీయ సనాతనధర్మం సంస్కృతి అతి ప్రాచీనం వైవిధ్యం ఉంది.ఎన్నో భాషలు మతాలు జాతులు తెగల కులాలతో భిన్నత్వంలో ఏకత్వం ఉన్న హమారా భారత్ మహాన్ 🌹
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం