వనపర్తి బాలకవికి తానా వారి ఆహ్వానం

 ప్రముఖ కవయిత్రి, రచయిత్రి శ్రీమతి వలిపే సత్యనీలిమ, లక్ష్మీ నరసింహా రావు గార్ల కుమారుడు బాలకవి చిరంజీవి వలిపే రామ్ చేతన్ చిన్నతనం నుంచే సాహిత్యంలో మెళకువలు తెలుసుకుని ప్రతిభ కనబరుస్తూ తనదైన శైలిలో రచనలు చేస్తూ అనేక కవితాపోటీలలో గెలుపొందాడు.9వ,తరగతి చదువుతున్న ఈ బాలకవి ఇప్పటికే రెండు పుస్తకాలు(అక్షర చైతన్యం, పచ్చ పచ్చని కథలు)ముద్రించాడు.తల్లి దండ్రుల సహకారంతో విజయాలు సాధిస్తున్నాడు.ఇంకా మూడు పుస్తకాలు ఆముద్రితాలుగా ఉన్నాయి. పలు అవార్డులు,రికార్డులు అందుకున్న ఈ బాలకవిని గుర్తించి ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా వారు నేటి బాల రచయితలే రేపటి మేటి రచయితలు అనే కార్యక్రమంలో మాట్లాడుటకు ఆహ్వానించడం జరిగింది. ఆదివారం జూమ్ లో జరగబోయే ఈ కార్యక్రమానికి బాలసాహిత్యంలో దిట్టలు అయిన పెద్దలు పాల్గొంటున్నారు.ఇలాగే ఇంకా ఎంతో మంచిపేరు తెచ్చుకుని మరెన్నో రచనలు చేసి అవార్డులు గెలుపొంది పుస్తకాలు ముద్రించాలని పలువురు ఈ బాలకవిని ప్రశంసించారు.
కామెంట్‌లు