క్లాస్ లో పిల్లలంతా తమమతం
దేవుళ్ళ గొప్ప తనం గూర్చి మాట్లాడుకుంటున్నారు.టీచర్ నిశబ్దంగా వారి మాటలు వింటోంది."పిల్లలూ!నా ప్రశ్నలకు మీ మాతృభాష లో జవాబీయండి. మనం స్నానం దేనితో చేస్తాం? నీ
నీరు పానీ వాటర్ జల్..తమభాషలో చెప్పారు."మనం ఎలా వెల్తాం?" సైకిల్ బస్సు కారు రైలు విమానం " పిల్లల జవాబువిని" అలాగే మన మతాలు.హిందూ మతం కన్నా ధర్మంగా ప్రపంచ శాంతిని కోరే అందరి మంచిని కోరుతుంది.ఇలాంటి ద్వేషం రోషాలతో రెచ్చగొట్టదు.క్లాస్ లో మీరంతా నాకు సమానం.అలాగే దైవం కి అంతా సమానమే! ఇప్పుడు మీకు ఓమహోన్నత వ్యక్తి గురించి చెప్తాను.స్వామి రంగనాధానందని ఎవరో అడిగారు " మీరు కారు కొనుక్కుని హాయిగా వెళ్లవచ్చు కదా? ఉపన్యాసాలు పనులతో టైం కల్సివస్తుందికదా? " దానికి ఆయన ఇచ్చిన జవాబు ఇది " మేము సన్యాసులం.నాకు కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.సంఘసేవ దేశ సేవ మంచిని రామకృష్ణ పరమహంస వివేకానందను గూర్చి చెప్పడమే మాధర్మం.స్వామి గా కాషాయం ధరించి నావిధులు కాపాడి ఆదర్శంగా ఉండాల్సిన బాధ్యత మాది "
టీచర్ అడిగింది" పిల్లలూ! కారులో తిరగటం గొప్ప కాదు.మంచిపనులు చేసే తలలో నాలుకలా ఉండే వ్యక్తి నే అంతా గౌరవిస్తారు.తెలిసిందా?" ఓ అంటూ తలలూపారు పిల్లలు🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి