మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శ హ |
కబంధం నామ రూపేణ వికృతం ఘోర దర్శనం |
తం నిహత్య మహాబాహుః దదాహ స్వర్గతః చ సః |
స చ అస్య కథయామాస శబరీం ధర్మ చారిణీం |
-శ్రీరాముడు సీతాదేవికై అడవులలో అన్వేషించుచు కబంధుడను పేరుగల రాక్షసుని గాంచెను. అతడు
వికృతాకారముతో చూడ భయంకరుడైయుండెను. మహాబాహువైన శ్రీరాముడు ప్రాణులను హింసించుచున్న ఆ దానవుని హతమార్చి, అతని
కోరికమేరకు ఆ కళేబరమును దహింపజేసెను.
ఫలితముగా అతనికి స్వర్గప్రాప్తికలిగెను.
శాపవిముక్తుడైన కబంధుడు దివ్యరూపముతో స్వర్గమునకు ఆకాశమున కొంతతడవాగి, శ్రీరామునితో "ఓ రామా! ఈ సమీపముననే నీ భక్తురాలైన శభరి గలదు. గురువులను సేవించుట ఆమె స్వభావము, అతిథి సత్కారముల యందు ఆమె నిరతురాలు. ఆమె సన్య్యాసిని, నీవు ఆ శబరి యొద్దకు వెళ్ళుము" అని పలికెను.
శ్రీ రామ్
**
శ్రీరాముడు ; కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి