వోని పాఠశాలలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం
 జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా, డా.వై.ఎస్.ఆర్.కంటివెలుగు ద్వారా వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులందరికీ కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి తెలిపారు. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, 
కుసిమి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేత్ర వైద్యాధికారి తెప్పల కృష్ణారావు నేతృత్వంలో 
పాఠశాలలో గల ఎనభై నాలుగు మంది బాలబాలికలకు కంటి పరీక్షలు నిర్వహించారు. 
ఈ ఆరోగ్య పరీక్షలు నిర్వహించుటలో
వోని సచివాలయం సామాజిక ఆరోగ్య అధికారిణి కిల్లాడి అనూష, ఎఎన్ఎం ఆరిక సుశీల, ఆశ కార్యకర్తలు టి.హైమవతి, వి.నీలవేణి పాల్గొన్నారు. 
ఎనిమిదో తరగతి బాలుడు కనపాక కిశోర్, ఏడో తరగతి బాలిక ముంజి భాస్విక, మూడో తరగతి బాలిక గిరడ శ్రావ్యలనే ముగ్గురికి కంటి అద్దాలు అవసరమని గుర్తించి, వారికి ఉచితంగా కంటి అద్దాలను 
పాఠశాల ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి, నేత్ర వైద్యాధికారి తెప్పల కృష్ణారావు, ఉపాధ్యాయులు గోగుల సూర్యనారాయణ, 
కుదమ తిరుమలరావుల చేతులమీదుగా బహూకరించారు.
కామెంట్‌లు