శ్రీ రాముడు ; కొప్పరపు తాయారు
 దేవతాభ్యో వరాం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ |
అయోధ్యాం ప్రస్థితః రామః పుష్పకేణ సుహృత్ వృతః |
భరద్వాజ ఆశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః |
భరతస్య అంతికం రామో హనూమంతం వ్యసర్జయత్ |
తనవిజయమును శ్లాఘించుటకై వచ్చిన 
దేవతలనుండి వరమును పొంది, శ్రీరాముడు ఆ 
వరప్రభావముతో రణరంగమున మృతులై 
పడియున్న వానరులను పునర్జీవితులను 
గావించెను. పిమ్మట శ్రీరాముడు 

సుగ్రీవవిభీషణాదిమిత్రులతో, 
వానరులందఱితోగూడి పుష్పకవిమానముపై 
అయోధ్యకు బయలుదేఱెను. !
శ్రీరాముడు తనవారితో భరద్వాజాశ్రమమునకు 
చేరెను. "పదునాలుగుసంవత్సరములు పూర్తియైన 
వెంటనే అయోధ్యకు తప్పక తిరిగి వత్తును" అని 
భరతునకు తాను ఇచ్చిన మాటను 
నిలబెట్టుకొనుటకై శ్రీరాముడు ముందుగా 
హనుమంతుని భరతునియొద్దకు పంపెను.!

కామెంట్‌లు