ఆకాశంలో! అచ్యుతుని రాజ్యశ్రీ

 సార్ పాఠం చెప్తుంటే పైన విమానం చప్పుడు వినిపించింది.అంతే ఆచెట్టు కింద కూచున్న పిల్లల తలలన్నీ ఒక్కసారిగా పైకి లేచాయి."అదిగో విమానం!" అరిచారు."మీమొహం! అది హెలికాప్టర్! ఎలక్షన్స్ కదా? అందులో వెళ్లితే ఎక్కడ పడితే అక్కడ దిగొచ్చు." జయ ఠపీమని జవాబిచ్చింది.సార్ కి ఆపిల్ల సమాధానం తో ముచ్చటేసింది."చప్పట్లు కొట్టండిరా పిల్లలు!" మా ఆడపిల్లలదే హవా.ఆకాశంలో సగం అంటూ అరిచింది జయ." నేను పైలెట్ ని ఔతాను సర్!"
పిల్లలంతా ఫక్కున నవ్వారు." వెర్రి నవ్వులు మానండిరా పిల్లలూ! ప్రపంచంలో మన భారతీయ మహిళా పైలెట్స్ సంఖ్య ఎక్కువ!" ఆ.. నిజంగానా సార్!? పిల్లల ప్రశ్న కి ఆయన జవాబిది."మన దేశంలో పైలట్స్ గా ఉన్న అమ్మాయిలు 12.4శాతం.తమ ఇల్లు అమ్మానాన్న కుటుంబం నుంచి విడిచి చాలా రోజులు గడపాలి.మిలటరీ లో కూడా సత్తా చాటుతున్నారు.ఇండిగో లో త్వరగా జాబ్ ఇస్తున్నారు.మహిళా పైలెట్స్ గర్భందాలిస్తే ఆకాశంలో ఎగిరే డ్యూటీ ఇవ్వరు.26నెలలజీతం మెటర్నిటీ లీవ్ చట్టప్రకారం ఇవ్వాలి.పిల్లల కోసం క్రెచ్ ఏర్పాటు ఉంది. పిల్లకి 5ఏళ్ళు వచ్చేదాకా  పైలెట్స్ కి ఫ్లెక్సిబుల్ కాంట్రాక్టు సౌకర్యం ఉంది." మగపిల్లలు అన్నారు" వాళ్ళకి అన్ని రోజులు సెలవు జీతాలా!?" మీ అమ్మ పైలెట్ ఐతే తెలుస్తుంది మీకు ఆబాధ? అన్న టీచర్ మాటలతో వారు గప్చిప్ ఐనారు🌹
కామెంట్‌లు