ఉప్మాలో... ఉల్లి
దోసలో ... ఉల్లి
పెసరెట్ లో.. ఉల్లి
ఏ కూరల్లో నైనా....
ఉల్లి తోనే మజా !
గుడ్డు, చేప, మాంసాలయితే
ఉల్లి లేనిదే రుచే రాదుగా.. !!
చిట్కా వైద్యం లోనూ .....
ఉల్లి ...స్తానం సంపాదించి0ది!
ఆరోగ్యానికి ఉల్లి
చేస్తుంది మేలు, తల్లిలా..!
కంట నీరు పెట్టుకునే
కోడలి దుఃఖం కప్పిపుచ్ఛి
నింద తను మోయు ఉల్లి
నిజముగనే కన్న తల్లి !
కేజీ పది రూపాయలకే...
దొరికే ఉల్లి.....
వంద రూపాయలై పోయి
తనకూఓరోజుంటుందంటుంది
ఎంత ప్రియమై పోయినా
వంటచేయలేము,ఉల్లి లేక..!
ఉల్లితో.... మనది....
విడదీయలేని బంధము !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి