*బాణసంచా... మొత్తం కాల్చేద్దాము !*- కోరాడ నరసింహా రావు !
పిల్లలూ... !
  దీపావళి  మతాబులు... 
    వెలిగిద్దాం    రండి... !
  అవి  ఎంత వింత గా... 
.  కాలునో చూద్దాం పదండి !!

రంగుల మంటలతో... 
  కాలును ఈ అగ్గిపుల్ల !
  నక్షత్రాలను చిమ్మును... 
  ఈ కాకర పువ్వొత్తు... !!

ముద్ద - ముద్ద లుగ కక్కును 
  ఈ  వెన్నముద్దలు... !
పువ్వులా పైకెగయును 
  ఈ చిచ్చు  బుడ్లు... !!

నేల  పైన  గిర్రుమని 
 గింగిరీలు  కొట్టును... 
   భూ చక్రాలు... !
 గజంపుల్లతోవిష్ణుచక్రాలు !!
 
రివ్వుమని నింగి కెగయు 
  నిప్పులు కక్కే ఆ తారాజువ్వ
   డాం... అంటూ పేలును... 
      ఈ  లక్ష్మీ  బాంబు !

మీ కోసం  కేపులతో... 
  తుపాకీలు  ఉన్నవి.. !
 ఆ ఛిఛిoద్రీ లు మీకు కాదు 
  అవి   అన్నయ్యలకు... !!

అమ్మ   పులిహోర... బొబ్బట్లు
   బూరెలను - పాయసమును 
  చేసిందoట ! మనంలొట్టలేసు      కుంటు  అన్నీ తిందామంట!!

సాయంత్రం  అందరమూ... 
....దీపాలను వెలివించి... 
 ఆముదంకర్రను కాల్చుదాము బాణసంచామొత్తంకాల్చేద్దాము 
      *******
కామెంట్‌లు