న్యాయాలు -315
సముద్ర మధుబిందు న్యాయము
*****
సముద్రము అంటే సాగరము జలనిధి పయోనిధి ఉదధి జలధి సంద్రము అనే అర్థాలు ఉన్నాయి.మధు అంటే తీయనిది ,సుఖకరమైనది, మద్యము,మకరందం , తేనె, వసంత ఋతువు, ఛైత్రాగమము,ఇంద్రమణి నడుమ, ఉదరము అనే అర్థాలు ఉన్నాయి.బిందు అంటే చుక్క, మచ్చ,సున్న అనే అర్థాలు ఉన్నాయి.
సముద్రములో తేనె చుక్క వేస్తే సముద్రంలోని నీరు తీయనవుతుందా? కాదు అనే అర్థంతో ఈ" సముద్ర మధుబిందు న్యాయము" ను ఉదాహరణగా చెబుతుంటారు.
సముద్రములో ఉన్న నీరంతా ఉప్పగానే వుంటుంది.అలాంటి నీటికి ఓ చుక్క తేనె కలిపితే కాదు. వందలు, వేల సంఖ్యలో తేనె చుక్కలు కలిపినా సముద్రం తీయగా మారదు.
మరి మన పెద్దలు ఈ "సముద్ర మధుబిందు న్యాయము"ను ఎందుకు చెప్పారు ?నిశితంగా పరిశీలిస్తే అందులోని నిగూఢమైన అర్థం మనకు బోధపడుతుంది.
తియ్యటి తేనె బిందువు లాంటి మంచి మనసున్న వారు కౄరాత్ములతో కలిస్తే వీరు కూడా వారిలా మారిపోతారు అనే అర్థం ఇందులో ఇమిడి ఉంది.అదెలాగో భాస్కర శతక కర్త రాసిన పద్యాన్ని చూద్దాం.
"కౄర మనస్కులౌ పతులగొల్చి వసించిన మంచివారికిన్/వారిఔ గుణంబెపట్టి చెడు వర్తన వాటిలు; మాధురీ జలో/దారలు గౌతమీ ముఖ మహానదు లంబుధి గూడినంతనే/ క్షారము చెందవే మొదలి కట్టడలిన్నయు దప్పి భాస్కరా."
క్రూరమైన మనసుగల రాజులు గానీ మరే ఇతరులను గానీ సేవించెడి ఉత్తమమైన అంటే మంచి వ్యక్తులు కూడా తమ సద్గుణములను కోల్పోయి వారి గుణాలను పొంది దుర్మార్గులుగా మారిపోతారు.అదెలా అంటే తీయని మధురమైన నీటిని కలిగిన మహా నదులన్నీ సాగరములో కలిసినంతనే తమకున్న మొదటి రుచిని వీడి ఉప్పదనాన్ని పొందుతాయి.
ఆ విధంగా తేనె బిందువులు కూడా తమ సహజ సిద్ధమైన తీయని గుణం పోగొట్టుకుంటాయి. ఈ అర్థమే కాకుండా అలాంటి దురాత్ములైన వ్యక్తులను తీయగా అంటే మంచి వారుగా మార్చాలనే ప్రయత్నం ఎలాంటి మంచి ఫలితాన్ని ఇవ్వదు సరికదా వీరే మారిపోయే పరిస్థితి వస్తుందని ఈ "సముద్ర మధుబిందు న్యాయము" ద్వారా గ్రహించవచ్చు.
కాబట్టి దీని ద్వారా మనం నేర్చుకోవలసింది ఏమిటంటే అలాంటి వారికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం, వారిని మార్చాలనే ప్రయత్నాలను, ఆలోచనలను విరమించుకోవడం.
మంచికి పోతే చెడు ఎదురైనట్లు అలాంటి వారి జోలికి పోకుండా ఉండటమే శ్రేయస్కరం. మనకున్న మంచితనం,మన ఉనికిని కాపాడుకోవడం ముఖ్యం కదా! మీరేమంటారు ?.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి