మనసు ! అచ్యుతుని రాజ్యశ్రీ

 క్లాస్ లో శివా లోలోపల ఏడుస్తూ కళ్ళు ముక్కు తుడుచుకుంటూ ఉంటే టీచర్ దగ్గరకు పిలిచింది." శివా! ఇవాళ స్లిప్ టెస్ట్ కి తయారు కాలేదా?" కాసేపు బుజ్జగించాక వెక్కుతూ అన్నాడు " టీచర్! రేత్రి మా అయ్య మస్తుగా తాగొచ్చి అమ్మని చావగొట్టిండు.నన్ను ఉతికేసిండు" అన్నాడు.టీచర్ వాడివీపుపై వాతలు చూసి తన బ్యాగ్ లోని ఆయింట్మెంట్ పూసింది.పిల్లలు ఇక తమ గోడు వెలిబుచ్చారు." మా యమ్మ అయ్య రేత్రంతా మస్తు కొట్లాడిండ్రు. అమ్మ కూడా సారా తాగింది."
టీచర్ చెప్పింది" నిజమే! రోజులు ఇప్పుడు అలాగే ఉన్నాయి.మస్త్ మస్త్ గా పైసలు బిర్యానీ దొరకడంతో త్రాగకపోతే లేచి కూచునే శక్తి లేకుండా తయారు అవుతున్నారు.శుక్రాచార్యులు ఏమన్నాడంటే తాగిన మైకంలో మనిషి వావి విచక్షణ కోల్పోయి రాక్షసుడు గా మారుతాడు.అందుకే ఇంట్లో పసిపిల్లలపై అత్యాచారం జరుగుతోంది.ఒకప్పుడు స్వయంగా తయారు చేసిన ఇప్పపూలు తాటికల్లు తాగే పేదలు ఇప్పుడు అప్పనంగా దొరుకుతుంది అని లేచింది మొదలు రాత్రి దాకా మద్యం చుక్కవేసే స్థితికి దిగజారారు.ఇప్పుడు కల్తీ రసాయనాలు కల్సింది తాగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.మీరు మాత్రం ఇలాంటివి పొరపాటున కూడా ముట్టవద్దు. గొప్ప వారి పిల్లలు బార్ పబ్ లో చేసే పని ఇదే! కాక్ టెయిల్ పార్టీ తో మత్తు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పోలీసులకు పెద్ద తలనొప్పి గా మారింది.అందుకే మీరు మంచి నీతి పుస్తకాలు చదవాలి.రేడియో వినాలి.పార్క్ లో ఆడాలి.శివా! రాత్రిపూట మాఇంట్లో పడుకో.నీవు మంచి బుద్ధి తెలివి ఉన్న వాడివి.మీ అమ్మ ను తీసుకుని రా!" అని ఓదార్చింది టీచర్.వాడి కళ్ళలో వెలుగు పూలు 🌸🌺
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం