యుటిఎఫ్ నూతన కార్యవర్గం ఎంపిక

 ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (ఎపియుటిఎఫ్) రాజాం మండలశాఖ నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించినట్లు, ఎన్నికల పరిశీలకులుగా విచ్చేసిన యుటిఎఫ్ విజయనగరం జిల్లా కార్యదర్శి బి.రామినాయుడు తెలిపారు. 
రాజాం విద్యా నికేతన్ పాఠశాల ఆవరణలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు సమక్షంలో ఈ సమావేశం జరిగింది. 
సంఘ సభ్యులచే ఏకగ్రీవంగా 
ఎంపికచేసిన ఈ కార్యవర్గాన్ని జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు మారెళ్ళ కృష్ణమూర్తి ప్రకటించి, సభావేదిక పైకి స్వాగతించారు.
మండల శాఖ అధ్యక్షులుగా మువ్వల రమేష్, ప్రధాన కార్యదర్శిగా బలివాడ నాగేశ్వరరావు,
గౌరవాధ్యక్షులుగా వి.శివరాం నాయుడు, ఉపాధ్యక్షులుగా పి.బాలకృష్ణ, మహిళా ఉపాధ్యక్షులుగా శాసపు భ్రమరాంబ, కోశాధికారిగా వై.భాస్కరరావు ఎంపికయ్యారు. సహ కార్యదర్శులుగా టి.ఎల్.ప్రసాద్, డి.భాస్కర్, బి.మల్లేశ్వరరావు, ఎం.శివున్నాయుడు, ఎం.శ్రీరాములు, బి.జగదీశ్వరరావు, సి.హెచ్.కృష్ణప్రసాద్, కె.సూర్యనారాయణ, వై.వెంకటరమణ, సి.హెచ్.సోమశేఖర్ ఎంపికైరి.
జిల్లా కౌన్సిలర్లుగా కురిటి బాలమురళీకృష్ణ, గేదెల రమేష్, డి.వెంకటరావు, కె.తిరుపతిరావు, బిల్లాన రామకృష్ణ, వడ్డి ఉషారాణి, 
సిపిఎస్ కన్వీనర్ గా ఆర్.దాలినాయుడు, 
మహిళా కన్వీనర్లుగా ఆర్.గీత, వై.భవాని, ఎం.పార్వతమ్మ, ఎం.శోభారాణి,
ఆడిట్ కన్వీనర్ గా పి.రాజాబాబు 
ఎంపికైరి. 
ఈ నూతన కార్యవర్గ సభ్యులను 
కె.బి.ఎం.కృష్ణ, 
డి.వి.రావు, పి.బి.కృష్ణలు ప్రతిపాదించగా జి.రమేష్, బి.జె.రావు, వి.ఎస్.ఆర్.నాయుడులు బలపర్చారు. 
అనంతరం ఎంపికైన కొత్త కార్యవర్గ సభ్యులచే విజయనగరం జిల్లా గౌరవాధ్యక్షులు సత్య శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం గావించారు.
ఈ కార్యక్రమంలో రాజాం మండల యుటిఎఫ్ నేతలతో పాటు, వంగర, రేగిడి, సంతకవిటి, జి.సిగడాం మండలాలకు చెందిన యుటిఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
కామెంట్‌లు