నంది (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
సంఖ్య -875+6
===========
నందికేశుడు శివుని వాహనము
దైవత్వము కలిగిందీ వృషభము
మానవులకి జీవిత సహాయము
సేవ, అంకితభావనల రూపము 
నందికి సదా మొక్కవలెను ఉమా!

కైలాసద్వార పాలకుడు గాను
శివుని సేనలకు అధిపతి తాను
శైవమత ప్రచారం చేయుటకు గాను
ఎనిమిదిమంది శిష్యుల తోడను
ప్రధాన గురువుగా నందియే ఉమా!

సనక,సనాతన,సనందనలు
సనత్కుమార, తిరుమలర్   లు
వ్యాఘ్రపాద,పతంజలి, శివయోగలు
ప్రచారంచేసే ఎనిమిది దిక్కులు
శివ సాయుజ్యము నందికల్గించు ఉమా!

తమిళనాడులో నన్ అనుపదము
వృద్ధి పొందుటని తెలుపు అర్థము
తెల్లని నంది, సంస్కృతంలో సంతోషము
ప్రతి శివాలయం నందిదర్శనము
స్వామికి ఎదురుగా ఆనందముతో ఉమా!

సింధూలోయ నాగరికతలో
పశుపతి ముద్ర కలిగియుండుటలో
మొహంజదారో హరప్పాలలో
ఎద్దుముద్రలు ప్రత్యేకమగుటలో
నందికి వేలఏళ్ళ ఆరాధన ఉమా!

శిరాదఋషికి కుమారుడుగాను
యజ్ఞంనుండియే నంది ప్రభవించేను
వజ్రకవచం ధరించియుండెను
సద్గుణములతో పెరుగుచునుండెను
నారదుడొచ్చి అల్పాయుష్కుడని చెప్పే ఉమా!

(సశేషం )
కామెంట్‌లు