ఏ ఆగంతకుడో
ప్రకృతిలో
గమ్మత్తైన ముగ్గులేసినట్లు
పూలకొమ్మల సోయగం!
తీరైన రంగుల పూలు
వాటిపైన
రంగురంగుల సీతాకోక చిలుకలు
పిల్లగాలులకు
అలవోకగా కదులుతున్న
ఇంద్రచాపంలా!
పరిమళాల గుబాళింపు
మనసును పరవశం చేస్తూ!
ఉద్యానవనాన్ని
సువాసనల గుబాళింపుతో
సుమవంతం చేసి
గాలి హంసలా ఒయ్యారాలు పోతోంది!
అక్కడి మట్టి, మొక్కలు, చెట్లు,
కొమ్మలు, రెమ్మలు, ఆకులు
ఇలా...అన్నీ! అన్నీ!
సుమధుర సౌరభాలు ఒలకపోస్తున్నాయి!
శరత్కాల శర్వరి
సంతోష చంద్రికలను
స్వరవంతంచేసి
మన
సఖీప్రియుల
సమాగమంకోసం
నిరీక్షిస్తూ ఉన్నది!!
*********************************
ఉద్యానవనం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి