దేవతల వాహనాలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 టీచర్ అడిగింది " వాహనం అంటే ఏమిటి?" పిల్లలు తెల్లమొహం వేశారు."వెహికిల్స్ అంటే తెలుసా?"  ఓ ..అంటూ కారు బస్ స్కూటర్ సైకిల్ " అరిచారు పిల్లలు.మరి దేవుళ్ళు వేటిని ఎక్కుతారు?" అంతా వినాయకుడు ఎలుక పై పార్వతి సింహంపై అని చెప్పారు."మరిఈ దేవతల వాహనాలు ఏంటో చెప్తా వినండి.శివుడి నెత్తిపై ఎవరుంటారు?" గంగ" కరెక్ట్! గంగాదేవి వాహనం మొసలి.మన్మధునికి చిలుకవాహనం. చిలుకపలుకులు అంటాం.అర్ధంతెలీకుండా మనం ఏది అంటే అదే అప్పజెప్తుంది. దీపావళి కి లక్ష్మీ పూజ చేస్తాం.ఆమె వాహనం ఉలూకం అంటే గుడ్లగూబ.తమోగుణంకి చిహ్నం.ఇక ఇంద్రునికి ఐరావతం అనే తెల్ల ఏనుగు ఉచ్ఛైశ్రవం అనే గుర్రం వాహనాలు.అగ్ని దేవుడి వాహనం మేషం.యముడివాహనం మహిషం అంటే దున్నపోతు గొప్ప శక్తి సహనంకి ప్రతీక.వరుణుడు వానదేవునికి మకరం.నీటిలో ఉన్నంతసేపూ దానిబలం.వాయుదేవునికి లేడి .చంచలస్వభావం. కుబేరుడు వాహనం నరుడు అహంకారం కి ప్రతీక.సూర్యుడికి సప్తాశ్వాలు.చంద్రునికి 10 గుర్రాలరధం కుజునికి మేషం బుధునికి సింహం గురువు కి హంసవాహనాలు. శుక్రునికి మండూకం అంటే కప్ప శనికి కాకివాహనం .మనలో సోమరితనం కూడదని కాకి సందేశం.రాహువుకి సింహం కేతువు కి గ్రద్ద వాహనాలు.సింహంలాగా బలంగా ఠీవిగా మండూకం అంటే కప్పలాగా తృప్తిగా ఉండాలి." దీనివల్ల మీకేం తెల్సింది?" " టీచర్! అన్ని ప్రాణులు సమానమే.వాటిలోని మంచిని తీసుకోవాలి" అన్నారు పిల్లలు🌷
కామెంట్‌లు