19, నవంబరు ప్రపంచ టాయిలెట్స్ దినం
====================================
మరుగుదొడ్డి (టాయిలెట్స్) అంటేనే ఎబ్బెట్టుగా
అసహ్యించుకునే పదం.
మరుగుదొడ్లు లేకపోతే మన పరిసరాలు వాతావరణం
కలుషితమయే అవకాశముంది.
మానవ విసర్జాలు జంతు విసర్జాల కంటే కల్మషం దుర్వాసనల
మిళితమై ఆరోగ్యానికి హాని కల్గించే అవకాశం ఉంది.
పాత కాలంలో మానవ విసర్జాలు ఇంటి పరిసరాలకు
దూరంగా విశాల మరుగు ప్రదేశాల్లో బహిర్భూమిలో
జరిగేవి.
గ్రామీణులు సూర్యోదయానికి ముందే ఊరి బయటకు పోయి
కాలకృత్యాలు తీర్చుకునే వారు. పురుషులు నోట్లో పొగాకు
చుట్ట లేక సిగరెట్ బీడీ వంటి ధూమపాన సాధనాలతో
చేతిలో చెంబు నీళ్లతో దూరంగా నడుచుకు వెళ్ళేవారు.
అప్పట్లో మహిళలకు బహిర్భూమి సదుపాయాలు లేక
చీకటి పడిన తర్వాత వెళుతు ఇబ్బందులు ఎదుర్కొనే వారు.
పిల్లలు ఇంటి దగ్గర పొలాలు తుప్పలు కాలిబాట పక్కన
మురుగు కాలువల వెంట కాలకృత్యాలు తీర్చుకునే వారు.
బహిరంగ మల విసర్జన వల్ల అనేక ఆరోగ్య సమస్యలు
కలుగుతున్నాయని తెలిసి ప్రభుత్వాలు ఇంటింటికి
మరుగు దొడ్డి పేరుతో గ్రామాల్లో ఇంటి పరిసరాల్లో
మరుగుదొడ్డి సౌలబ్యం కలిగించారు.
మన శరీర జీవన క్రియ సక్రమంగా జరిగి నోటి ద్వారా
తీసుకున్న ఆహారం కడుపులో చేరి జీర్ణం కాగా మిగిలిన
వ్యర్థ పదార్థాలు మలరూపంలో బహిర్గతం కావడం , ఆ మలం
సక్రమమైన రీతిలో నాశనం కావాలంటే మరుగు (చాటు) దొడ్డి
అవుసరమవుతుంది.
పూర్వం పట్టణాలు నగరాల్లో ఇంటి పరిసరాల్లో మరుగుదొడ్డి
సదుపాయాలు ఉండేవి. కొన్ని చోట్ల సిమ్మెంటు టేంకుల్లోకి గొట్టాల
ద్వారా మల మూత్రాలు చేరితే , మరికొన్ని చోట్ల మనుషుల ద్వారా
మల విసర్జన వ్యర్థాలు పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది దూరంగా
తీసుకుపోయేవారు.
మనిషి నోటి ద్వారా ఇష్టంగా వివిధ రుచులతో, సువాసనలతో తిన్న
ఆహారం గొంతులో నుంచి కడుపు లో చేరి కొన్ని గంటలు అనేక ద్రవాలతో
రసాయన క్రియ జరిగి మలంగా మారి ప్రేవుల ద్వారా మలద్వారానికి అక్కడి
నుంచి బయటకు విసర్జింపబడుబడుతుంది.
ఇష్టంగా తిన్న ఆహారం కొన్ని గంటలు కడుపులో ఉన్న తర్వాత
మల రూపంలో బయటకు వచ్చేసరికి దుర్ఘంధ పూరితంగా
మారి ఛీ అని అసహ్యించుకునే స్థితికి వస్తుంది.
అలాగే అనేక రుచులతో సేవించిన ద్రవ పదార్థాలు కడుపులోకి చేరి
అక్కడి నుంచి కిడ్నీల ద్వారా ప్రక్షాళన జరిగి రసాయన
మార్పులతో మూత్రంగా మూత్రాశయం నుంచి బయటకు
విసర్జింప బడగానే దుర్వాసనతో ఏహ్యభావం కలుగుతుంది.
మలమూత్రాదులు శరీరంలో ఉన్నంత వరకు శుద్ధం (పవిత్రం)
బయటకు రాగానే అశుద్ధంగా చూస్తారు. ఆ విసర్జకాలు ఇంటి
పరిసరాలకు దూరంగా బహిర్భూమిలో విసర్జింప బడి
నాశనమవాలి.
ఈ క్రియ అన్ని జీవుల్లో జరుగుతుంది.
నోరు శరీర పోషణకు ఆహారాన్ని ఎలా అందిస్తుందో అలాగే
రోగాలకు కూడా ముఖద్వారం లాంటిది. కలుషిత ఆహారం ,
కలుషిత నీటి ద్వారా రోగ క్రిములు శరీరం లోపల ప్రవేసించి
రోగాలకు కారణమవుతాయి.
తరాలు మారుతున్నాయి. వాతావరణ పరిస్థితులలో
మార్పులు జరుగుతున్నాయి.భూమండలం మీద మనుషులతో
పాటు జీవుల సంఖ్య పెరుగుతు వచ్చింది. వత్తిడి ఎక్కువైంది.
మనిషి తన సౌలబ్యం కోసం దొరికిన స్థలాలను ఆక్రమించి
మనుగడ ప్రారంభించాడు. కొండలు కోనలు అడవులు ఇలా
ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ జీవనం ప్రారంభించాడు.
గూడేలు పల్లెలు గ్రామాలలో నివాసాలు ఏర్పడి జనసంఖ్య
పెరుగుతు వచ్చింది.
తర్వాత నాగరికత పేరుతో అనేక ఆధునాతన మార్పులు
చోటు చేసుకుని మనిషి పట్టణాలు నగరాలలో నివాశం
ఏర్పాటు చేసుకుని జనసాంద్రత పెరుగుతు వచ్చింది.
జనసంఖ్య పెరిగి నివాస స్థలాల కొరత వచ్చి తక్కువ స్థలంలో
అంతస్థుల భవనాలు నిర్మితమవుతున్నాయి.
మురుగు నీటితో పాటు మల మూత్రాదులు నివాస స్థలాల
నుంచి బయటకు పంపడానికి అనేక సాధనాలు ఉపయోగించ
వల్సి వస్తోంది.
గ్రామాలలో స్థలం విస్తీర్ణంగా ఉండటం వల్ల బహిర్భూమి
పేరుతో నివాసాలకు దూరంగా మరుగు ప్రదేసాలలో మల
విసర్జన కావించేవారు.
పట్టణాలలో ఇంటి ఆవరణలో మరుగుదొడ్లు ఏర్పాటు చేసి
ఆ విసర్జకాలను సిమ్మెంటు టేంకులు , మనుషుల ద్వారా లేదా కాలువల
కాలువల ద్వారా బయటకు పంపవల్సి వస్తోంది.
క్రమేపి జనసంఖ్య పెరుగుతు పల్లె వాసులు జీవనోపాధికి పట్టణాలు
నగరాలకు వలసలు రావడంతో కాళీ ప్రదేశాల కొరత ఏర్పడి
అంతస్థుల భవన సముదాయాలు నిర్మిత మవుతున్నాయి.
ఇంట్లోనే మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు.' ఛీ' అనిపించే
నివాస ప్రదేసాలకు దూరంగా జరగ వల్సిన విసర్జాలు ఇళ్లలోనే
జరుగుతున్నాయి. వంటగది , దేవుడి పూజామందిరం పక్కనే
బాత్రూమ్ లో మరుగుదొడ్లు (టాయిలెట్లు) నిర్మిత మవుతున్నాయి.
మలమూత్ర విసర్జకాలు గొట్టాల ద్వారా భూమార్గంలో
దూరంగా పంపబడుతున్నాయి.
ప్రభుత్వ కార్యాలయాలు , విద్యా మందిరాలు , వైద్యశాలలు,
రోడ్డు పక్కన అంతటా మరుగుదొడ్లు , మూత్రశాలలు
నిర్మిత మవుతున్నాయి.
దుర్ఘంధ పూరితమైన మానవ విసర్జకాలు ఇంటికి దూరంగా
బహిర్భూమి పేరుతో ఉండే మరుగుదొడ్లు(వాష్ రూమ్స్) నేటి ఆధునిక
నవనారిక ప్రపంచంలో విలాస వంతమైన భవనాల్లో నాలుగు గోడల మద్య
ఆధునిక వసతులతో వినోద గదులుగా రంగు రంగుల దీపాల మద్య
సుగంధ పరిమళాలతో వాద్య వినోద సంగీతాలతో మొబైల్ ఫోన్లలో
మాట్లాడుతు వివిధ ఆకారాలతో సాంప్రదాయ మరుగుదొడ్లు ఇండియన్ అని ,
విదేశీ మరుగుదొడ్లు వెష్ట్రన్ పేరుతో పడక గదుల్లో అమర్చుకుంటున్నారు.
చేతులు శుభ్రం చేసుకోడానికి వివిధ పరిమళాలు వెదజల్లే వాషింగ్ లిక్విడ్స
రసాయనాలు అందుబాటులో ఉంటున్నాయి.
విమానాలు, నౌకలు , లక్జరీ బస్సులు ఇతర ప్రయాణ సాధనాలలో వాష్ రూమ్
లంటు నీటి సదుపాయాలు ఉన్నప్పటికీ, పాశ్చాత్య పద్దతిలో మెత్తటి టిస్యూ పేపర్ల వి
వినియోగం జరుగుతోంది.
కొన్ని ప్రాంతాలలో బయో టాయ్ లెట్సు పేరుతో ఆధునాతన మరుగుదొడ్లు వాడుకలో
కొచ్చాయి.
వృద్ధులు, వికలాంగులకు తొట్టెలు అమర్చిన చక్రాల మరుగుదొడ్లు , పిల్లలకు ప్లాస్టిక్
తొట్టె అమర్చి ఆటలాడుకుంటు పాటలు వింటు రకరకాల బొమ్మలతో ఉండే కిడ్డీ
టాయిలెట్స్, ప్రయాణాలప్పుడు , వినోద కార్యక్రమాలలో వాడే పేంపర్స్ , డైపర్స్ పేరుతో
స్పాంజీ మెత్తటి గుడ్డతో తయారు చేసి వాడిన తర్వాత పారవేసే రెడీ మేడ్ మరుగుదొడ్లు
ఉంటున్నాయి.
ఇంకా భవిష్యత్తులో మరుగుదొడ్లు ఏఏ రూపాలు మార్పు
చెందుతాయో?
😎* 😢 *😟
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి