శ్రీ రాముడు ; కొప్పరపు తాయారు
 తతః సుగ్రీవ సహితో గత్వా తీరం మహా ఉదధేః |
సముద్రం క్షోభయామాస శరైః ఆదిత్య సన్నిభైః |
దర్శయామాస చ ఆత్మానం సముద్రః సరితాం పతిః |
సముద్ర వచనాత్ చ ఏవ నలం సేతుం అకారయత్ |
తేన గత్వా పురీం లంకాం హత్వా రావణం ఆహవే |
రామః సీతాం అనుప్రాప్య పరాం వ్రీడాం ఉపాగమత్ |
తాం ఉవాచ తతః రామః పరుషం జన సంసది |
అమృష్యమాణా సా సీతా వివేశ జ్వలనం సతీ |
హనుమంతుడు తెలిపిన సమాచారమును గ్రహించిన పిమ్మట, శ్రీరాముడు సుగ్రీవాదులతోగూడి, మహాసముద్ర తీరమునకు చేరెను. అనంతరము అతడు సూర్యకిరణములవలె తీక్షములైన బాణములతో సముద్రమును అల్లకల్లోలమొనర్చెను. అంతట సముద్రుడు రామునకు నిజరూపమును ప్రదర్శించెను. సముద్రుని సూచనలను అనుసరించి, శ్రీరాముడు సముద్రముపై నలునిద్వారా సేతువును నిర్మింపజేసెను. !
ఆ సేతువుద్వారా లంకను జేరి, శ్రీరాముడు రావణుని రణరంగమున హతమార్చెను. తదనంతరము సీతను సమీపించి, పరుల పంచననున్న ఆమెను స్వీకరించుటకు (లోకోపవాదశంకతో) వెనుకాడెను. (సీతాదేవి సౌశీల్యమునుగూర్చి ఎల్లరకును విశ్వాసము కలిగించుటకై) అందఱియెదుట శ్రీరాముడు పరుష వచనములను పలికెను. సాధ్వియైన ఆ సీతాదేవి ఆ కఠినోక్తులను భరింపజాలక అగ్నిలో ప్రవేశించెను.
 

కామెంట్‌లు